వైఎస్‌, బాబులో కొమ్మినేని గుర్తించిన తేడా ఇదేనట...

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు తాను నచ్చకపోవడం వల్లే ఎన్టీవీలో ఉద్యోగం పోయిందని చెప్పారు. గతంలో తాను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు వైఎస్‌ను విమర్శిస్తూ పెద్దెత్తున కథనాలు రాశామన్నారు. కొన్నిసార్లు వైఎస్ విధానాలు కొన్నింటిని తప్పుపడుతూ సీనియర్ జర్నలిస్టులమంతా వాదించామని చెప్పారు. కానీ ఏనాడు వైఎస్‌ కక్షసాధించలేదని చెప్పారు. చాలా గౌరవంగానే చూసేవారని చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌లో తాను గుర్తించిన తేడా ఒకటి ఉందన్నారు. […]

Advertisement
Update: 2016-06-24 02:03 GMT

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు తాను నచ్చకపోవడం వల్లే ఎన్టీవీలో ఉద్యోగం పోయిందని చెప్పారు. గతంలో తాను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు వైఎస్‌ను విమర్శిస్తూ పెద్దెత్తున కథనాలు రాశామన్నారు. కొన్నిసార్లు వైఎస్ విధానాలు కొన్నింటిని తప్పుపడుతూ సీనియర్ జర్నలిస్టులమంతా వాదించామని చెప్పారు. కానీ ఏనాడు వైఎస్‌ కక్షసాధించలేదని చెప్పారు. చాలా గౌరవంగానే చూసేవారని చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌లో తాను గుర్తించిన తేడా ఒకటి ఉందన్నారు.

వైఎస్‌కు వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయన్నారు. చంద్రబాబులో మాత్రం రానురాను సంకుచిత భావాలు పెరుగుతున్నాయని అన్నారు. గత తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబును గమనించానని… కానీ ఇప్పుడున్నంత దారుణంగా అప్పట్లో ఉండేవారు కాదన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసినప్పుడు కూడా చెప్పానన్నారు. ముఖ్యమంత్రులు స్వయంగా కండువాలు కప్పి ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఫిరాయింపు అంశం జగన్‌కో, జానారెడ్డికో సంబంధించిన విషయం కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అందుకే ఒక జర్నలిస్టుగా తాను తప్పుపట్టానని… దాన్నికూడా టీడీపీ నేతలు తప్పుపడితే తాను చేయగలిగింది ఏమీ లేదన్నారు.

సీఎం అయ్యాక చంద్రబాబు ఒకసారి సీనియర్ జర్నలిస్టులను లంచ్‌కు పిలిచారని కొమ్మినేని చెప్పారు. ఆ సమయంలో ”మీరు మారరా” అంటూ తనను సీఎం ప్రశ్నించారని వెల్లడించారు. అయితే తాను, తమ ఛానల్ ఏం తప్పు చేశామో చెప్పాలని అడిగానని బహుశా అప్పటినుంచే తనపై చంద్రబాబుకు వ్యతిరేక భావన ఏర్పడి ఉండవచ్చన్నారు. గతంలో కాకినాడ సెజ్‌, వాన్‌పిక్‌కు బీడుభూములు తీసుకోవడాన్ని కూడా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా రాజధాని కోసం పంటలుపండే భూములు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందన్నారు కొమ్మినేని.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News