మళ్లీ బిత్తరపోయిన గొట్టిపాటి

ఫిరాయించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో గొట్టిపాటి రవికుమార్ ఒకరు. అద్దంకి నుంచి వైసీపీ తరపున గెలిచిన ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. అయితే సీనియర్ నేత కరణం బలరాం మాత్రం గొట్టిపాటికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఒక సీఐ బదిలీ విషయంలో గొట్టిపాటికి ఊహించని షాక్ తగలింది. అద్దంకి సీఐగా పనిచేస్తున్న బేతపూడి ప్రసాద్… కరణం బలరాంకు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉంది. ఈనేపథ్యంలో ఆయనను గొట్టిపాటి రవికుమార్ పట్టుబట్టి మరీ బదిలీ చేయించారు. […]

Advertisement
Update: 2016-06-13 23:02 GMT

ఫిరాయించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో గొట్టిపాటి రవికుమార్ ఒకరు. అద్దంకి నుంచి వైసీపీ తరపున గెలిచిన ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. అయితే సీనియర్ నేత కరణం బలరాం మాత్రం గొట్టిపాటికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఒక సీఐ బదిలీ విషయంలో గొట్టిపాటికి ఊహించని షాక్ తగలింది. అద్దంకి సీఐగా పనిచేస్తున్న బేతపూడి ప్రసాద్… కరణం బలరాంకు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉంది. ఈనేపథ్యంలో ఆయనను గొట్టిపాటి రవికుమార్ పట్టుబట్టి మరీ బదిలీ చేయించారు.

కొందరు టీడీపీ పెద్దల ద్వారా ఒత్తిడి తెప్పించి డీఐజీ సాయంతో బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేయించారు. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆయన స్థానంలో హైమారావును తీసుకొచ్చారు. దీంతో గొట్టిపాటి వర్గం సంబరపడిపోయింది. కీలకమైన సీఐని బదిలీ చేయించడం ద్వారా తమదే పైచేయి అయిందని చెప్పుకున్నారు. అయితే తనవాడైన సీఐను గొట్టిపాటి బదిలీ చేయించడంతో కరణం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా చంద్రబాబు, లోకేష్ వరకు విషయం తెసుకెళ్లినట్టు చెబుతున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన వాడు సీఐలను బదిలీ చేయిస్తుంటే చేతగాని వాడిలా కూర్చోవాలా అని బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

సీఐ బదిలీని వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పార్టీ పెద్దలకే తేల్చి చెప్పారట. డీజీపీతోనూ నేరుగా మాట్లాడారని చెబుతున్నారు. దీంతో 24 గంటలు గడవకముందే సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీ ఆగిపోయింది. ఉత్తర్వులు వెనక్కుతీసుకున్నారు. దీంతో గొట్టిపాటి వర్గం కంగుతింది. తమదే పైచేయి అయిందని అప్పటికే ప్రచారం చేసుకున్న ఎమ్మెల్యే, ఆయన అనుచరులు.. కరణం బలరాం దెబ్బకు షాక్ అయ్యారని చెబుతున్నారు. తనను బదిలీ చేయించే ప్రయత్నం చేశారన్న కసితో సీఐ బేతపూడి ప్రసాద్… తమ పట్ల మరింత కఠనంగా వ్యవహరిస్తారని గొట్టిపాటి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. కరణం బలరాం ఆగ్రహం చూసిన తర్వాత గొట్టిపాటిని టీడీపీలోకి తీసుకొచ్చిన పార్టీ పెద్దలు కూడా ఎమ్మెల్యేకు సపోర్టు ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News