వైఎస్ దేవుడు... నేను రాక్షసుడినా?

ముద్రగడ దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా వదిలేయాలా అనిప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. తునిలో కొందరు అరాచకం సృష్ఠించారని చంద్రబాబు ఆరోపించారు. కాపులకు వైఎస్‌ దేవుడయ్యారా అని ప్రశ్నించారు. తనను మాత్రం రాక్షసుడిలాగా చూస్తారా అని చంద్రబాబు విమర్శించారు. కులం పేరుతో ముద్రగడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయని, ప్రతిఒక్కరు సహకరించాలని చంద్రబాబు కోరారు. […]

Advertisement
Update: 2016-06-09 00:53 GMT

ముద్రగడ దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా వదిలేయాలా అనిప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. తునిలో కొందరు అరాచకం సృష్ఠించారని చంద్రబాబు ఆరోపించారు. కాపులకు వైఎస్‌ దేవుడయ్యారా అని ప్రశ్నించారు. తనను మాత్రం రాక్షసుడిలాగా చూస్తారా అని చంద్రబాబు విమర్శించారు. కులం పేరుతో ముద్రగడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయని, ప్రతిఒక్కరు సహకరించాలని చంద్రబాబు కోరారు. ముద్రగడకు తానుప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. ముద్రగడ వాస్తవాలు గ్రహించాలన్నారు. దీక్ష విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. మరోవైపు ముద్రగడ వెనుక జగన్ డైరెక్షన్ ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు ఆరోపించారు. కాపులంతా చంద్రబాబు వెంటే ఉన్నారని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News