జగనే లీడర్ అనుకునేవారున్నారు.. అందుకే కడపలో పెట్టాం " అనిత... పిచ్చిమాటలు వద్దు... 600 కోట్లతో తిరిగితే నీవు కూడా మిగలవు- వాసిరెడ్డి

ఒక టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో టీడీపీఎమ్మెల్యే అనిత, వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మధ్య హాట్‌హాట్‌గా వాదన జరిగింది. జగన్‌పై నమ్మకం లేక, జగన్‌ తీరును భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అనిత అన్నారు. తన తీరుపై జగన్‌ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని సూచించారు. తమకు మేజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నందున ఫిరాయించిన ఎమ్మెలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అనిత చెప్పారు. ఇందుకు స్పందించిన వాసిరెడ్డి పద్మ… జగన్‌ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు పార్టీ […]

Advertisement
Update: 2016-06-08 07:23 GMT

ఒక టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో టీడీపీఎమ్మెల్యే అనిత, వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మధ్య హాట్‌హాట్‌గా వాదన జరిగింది. జగన్‌పై నమ్మకం లేక, జగన్‌ తీరును భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అనిత అన్నారు. తన తీరుపై జగన్‌ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని సూచించారు. తమకు మేజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నందున ఫిరాయించిన ఎమ్మెలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అనిత చెప్పారు. ఇందుకు స్పందించిన వాసిరెడ్డి పద్మ… జగన్‌ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే మరి తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా టీఆర్ఎస్‌లో ఎందుకు చేరారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబులోనూ నాయకత్వ లక్షణాలు లోపించాయా అని ప్రశ్నించారు. కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటూ అందుకు కారణం జగనే అనడం మానుకోవాలని సూచించారు. తాము కూడా దిగజారి రూ. 600 కోట్లు చేతిలో పెట్టుకుని తిరిగితే ఎమ్మెల్యే అనిత కూడా టీడీపీలో మిగలరని వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు.

నవనిర్మాణ మహా సంకల్ప దీక్షను ఒంగోలు నుంచి కడపకు మార్చడంపై అనిత స్పందించారు. ఏ-వన్ ముద్దాయిగా ఉన్న జగనే తమ నాయకుడనుకునేవారు కడపలో ఉన్నారని అందుకే అక్కడ సభ పెడుతున్నామని చెప్పారు. సభ ద్వారా జనంలో మార్పు తెస్తామన్నారు. జగన్ ఒక మానసిక రోగి అంటూ విమర్శించారు అనిత. దీనిపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడవద్దు. ఇదేమీ అసెంబ్లీ కాదు ఇష్టమొచ్చినట్టు మాట్లాడేందుకు. ముందు వెళ్లి పిచ్చిస్పత్రిలో చికిత్స చేయించుకోండి అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

జగన్‌ను ఆడిపోసుకునేందుకే నవనిర్మాణ దీక్షను కడపలో పెడుతున్నట్టుగా అనితే ఒప్పుకున్నారని అన్నారు. దీని బట్టే సంకల్పదీక్ష విషయంలో చంద్రబాబు అసలు ఉద్దేశం అర్థమవుతోందన్నారు. మెంటల్‌వాళ్లంతా టీడీపీలోనే ఉన్నారన్నారు. ఇప్పటి వరకు జరిగిన రుణమాఫీ లెక్కలు చెప్పాలని వాసిరెడ్డి పద్మ నిలదీయగా… అంకెలు చెప్పేందుకు అనిత తికమకపడ్డారు. చర్చాకార్యక్రమాల్లో ఎలా అబద్దాలు చెప్పాలి, ఎలా ఎదురుదాడి చేయాలి వంటి అంశాలపై టీడీపీకి నాయకులకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో ట్రైనింగ్ ఇస్తారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News