బాబు పాలనపై రాజు కథ చెప్పిన పార్థసారథి

రెండేళ్ల చంద్రబాబు పాలనపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుపై బుధవారం అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడతామని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి చెప్పారు. మోసం చేసిన కేసులో ఏఏ సెక్షన్లు వర్తిస్తాయో వాటన్నింటి కింద కేసులు పెడతామన్నారు. పట్టిసీమ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పార్థసారథి విమర్శించారు. గోదావరి నుంచి కృష్ణ డెల్టాలోని 8.5లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినట్టు గొప్పలు చెబుతున్నారని… రాయలసీమకు పట్టిసీమ నీరుచేరినట్టు అబద్ధాలు చెబుతున్నారని […]

Advertisement
Update: 2016-06-08 00:24 GMT

రెండేళ్ల చంద్రబాబు పాలనపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుపై బుధవారం అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడతామని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి చెప్పారు. మోసం చేసిన కేసులో ఏఏ సెక్షన్లు వర్తిస్తాయో వాటన్నింటి కింద కేసులు పెడతామన్నారు. పట్టిసీమ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పార్థసారథి విమర్శించారు. గోదావరి నుంచి కృష్ణ డెల్టాలోని 8.5లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినట్టు గొప్పలు చెబుతున్నారని… రాయలసీమకు పట్టిసీమ నీరుచేరినట్టు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాలువల వెంబడి మీడియాను తీసుకెళ్లి చూపిస్తే బాబు అసలు అనుసంధానం కథ తెలిసిపోతుందన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు పాలన తీరును వివరిస్తూ పార్థసారథి ఒక కథ చెప్పారు.

ఒక రాజు తన పాలనను ప్రజలంతా ఎల్లకాలం గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో తన రాజ్యంలోని పెద్దలందరినీ పిలిచి ఏంచేస్తే తన పాలనను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అడిగారట. అప్పుడు పెద్దలు .. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీరలిస్తే చిరిగిపోతాయి. మరణించేవరకూ పాలనగుర్తుండాలంటే ప్రజలందరికీ కర్రు కాల్చి వాతలుపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఈసలహాను ఏకగ్రీవంగా ఆమోదించి ప్రజలందరికీ సదరు రాజు కర్రుకాల్చి వాతలు పెట్టించారట అని పార్థసారథి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు పాలన కూడా అలాగే ఉందని పార్థసారథి ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News