మాజీ ముఖ్యమంత్రి మనుమడి ఆత్మహత్య!
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనుమడు హర్కిరత్ సింగ్ (41) ఛండీగఢ్‌లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో తల వద్ద షూట్ చేసుకున్నాడు. తమ సొంత గ్రామం కోట్లీకి సర్పంచ్‌గా పనిచేస్తున్న హర్కిరత్ సింగ్ కొన్నాళ్లుగా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. గత ఏడాది యాక్సిడెంట్‌కి గురైన సింగ్, రెండు నెలల క్రితమే కోమానుండి బయటకు వచ్చాడు. కాగా తమ సోదరుడు 1995 నుండి డిప్రెషన్‌కి చికిత్స తీసుకుంటున్నాడని సింగ్ […]
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనుమడు హర్కిరత్ సింగ్ (41) ఛండీగఢ్‌లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో తల వద్ద షూట్ చేసుకున్నాడు. తమ సొంత గ్రామం కోట్లీకి సర్పంచ్‌గా పనిచేస్తున్న హర్కిరత్ సింగ్ కొన్నాళ్లుగా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. గత ఏడాది యాక్సిడెంట్‌కి గురైన సింగ్, రెండు నెలల క్రితమే కోమానుండి బయటకు వచ్చాడు. కాగా తమ సోదరుడు 1995 నుండి డిప్రెషన్‌కి చికిత్స తీసుకుంటున్నాడని సింగ్ కజిన్, లూథియానాఎంపి రవనీత్ బిట్టూ తెలిపాడు. హర్కిరత్ సింగ్ అన్న గుర్కిరత్, ఖన్నా ఎమ్మెల్యే కాగా, వీరి తండ్రి తేజ్ ప్రకాష్ 1990ల్లో కేబినేట్ మంత్రిగా ఉన్నారు.
సింగ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. 1995లో బియాంత్ సింగ్ హత్య తరువాత ఈ కుటుంబంలో చాలామందికి పోలీస్ సెక్యురిటీ ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌తో పాటు అనేకమంది ప్రముఖులు హరికిరత్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.