పతనం అంచున బాబు పత్రిక

చంద్రబాబు లీక్‌ పత్రిక చేస్తున్న విన్యాసాలు చూసి కడుపుకు అన్నం తినే వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు టీడీపీ పెద్దలు అత్యాచారం చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటుంటే దాన్ని మాట వరుసకైనా ఖండించాల్సిన పత్రికా జర్నలిజం ఇప్పుడు విలువల పతనంలో కొత్త పుంతలు తొక్కుతోంది. బాబు గారి లీక్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. అందులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కేరళ, గోవాకు తరలించారని, రాజకీయాల్లో జగన్ కొత్త […]

Advertisement
Update: 2016-05-30 01:11 GMT

చంద్రబాబు లీక్‌ పత్రిక చేస్తున్న విన్యాసాలు చూసి కడుపుకు అన్నం తినే వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు టీడీపీ పెద్దలు అత్యాచారం చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటుంటే దాన్ని మాట వరుసకైనా ఖండించాల్సిన పత్రికా జర్నలిజం ఇప్పుడు విలువల పతనంలో కొత్త పుంతలు తొక్కుతోంది. బాబు గారి లీక్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. అందులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కేరళ, గోవాకు తరలించారని, రాజకీయాల్లో జగన్ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని వాపోయింది. ఇలా చేయడం చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ఇళ్లకు తాళాలేసుకుని వెళ్తే మేమెలా బతకాలని దొంగలు వాపోయినట్టు వాపోయింది. అంతేకాదు…

ఇలా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేదని చెప్పుకొచ్చింది. పత్రికలు చదివే ప్రజలు పిచ్చివాళ్లని నమ్మకం మరి!. ఒకప్పుడు ఎన్టీఆర్‌ను పదవీ నుంచి దించేందుకు నాదెండ్ల భాస్కరరావు ప్రయత్నిస్తే అప్పుడు ఇదే చంద్రబాబు ఎమ్మెల్యేలను బస్సుల్లో వేసుకుని కర్నాటకలోని నంది హిల్స్ తరలించలేదా?. వైసీపీ కేవలం గద్దలాంటి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తోంది… ఇదే చంద్రబాబు ఏకంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తీసుకెళ్లి వైస్రాయ్‌ హోటల్ లో పెట్టుకోలేదా?. పైగా ఎమ్మెల్యేలను క్యాంపులకు తీసుకెళ్లడం వల్ల తమ పార్టీకే నష్టమని ఒక వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే చెప్పారంటూ లీక్ పత్రిక పేరు లేని సాక్ష్యాన్ని ప్రచురించింది.. . అవును మరి కష్టపడి 17 మందిని కొనేశారు.

ఇప్పుడు మిగిలిన వారిని కొనకపోతే రాజ్యసభ సీటు రాదు. 17 మంది మీద తమ అభిమాన నాయకుడు పెట్టిన సొమ్మంతా వృథా అవుతుంది అన్నది లీకు పత్రిక బాధ కాబోలు. అందుకే క్యాంపులకు వెళ్లిన ఎమ్మెల్యేలు బయటకు రండి మా నాయకుడు కొనుక్కుంటారు అని వాపోతోంది లీకు పత్రిక. ఒక అత్యాచారం చేస్తుంటే అడ్డుకోకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందడం ఎంత తప్పో… పవిత్రమైన జర్నలిజంలో ఉంటూ మరీ ఇంతగా దిగజారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ప్రతిపక్షం సహకరించడం లేదని అధికారపార్టీ తరపున చిందులు తొక్కడం కూడా అలాంటి నేరమే. ఇలాంటి నీచరాజకీయం రేపొద్దున అధికారంలోకి వచ్చి జగన్ చేసినా నేరమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News