మతి మరుపు బాబుకా? ప్రజలకా? సంబరపడుతున్న లోకేష్

గుర్తుందా!. రాష్ట్ర విభజన జరిగి ఏపీలో అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఈసీ పెట్టిన నిబంధనలకు దరిదాపుల్లో లేనప్పటికీ ఏపీ, తెలంగాణలో పార్టీ ఉందంటూ తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. బాబు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాగా.. చినబాబు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొలువుతీరారు. ఆ సమయంలో టీడీపీ దేశం మొత్తం విస్తరిస్తుందన్న రేంజ్‌లో చినబాబు,పెదబాబు ప్రసంగించారు. త్వరలోనే కర్నాటక, తమిళనాడు, […]

Advertisement
Update: 2016-05-22 01:55 GMT

గుర్తుందా!. రాష్ట్ర విభజన జరిగి ఏపీలో అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఈసీ పెట్టిన నిబంధనలకు దరిదాపుల్లో లేనప్పటికీ ఏపీ, తెలంగాణలో పార్టీ ఉందంటూ తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. బాబు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాగా.. చినబాబు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొలువుతీరారు.

ఆ సమయంలో టీడీపీ దేశం మొత్తం విస్తరిస్తుందన్న రేంజ్‌లో చినబాబు,పెదబాబు ప్రసంగించారు. త్వరలోనే కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ టీడీపీ పాగా వేస్తుందని… అప్పుడు అధికారికంగా టీడీపీ జాతీయ పార్టీ అవుతుందని చెప్పారు. కానీ తెలంగాణలో టీడీపీ రసం పిండేశారు కేసీఆర్. అప్పటి నుంచి టీడీపీ నుంచి జాతీయ పార్టీ అన్న మాటే రావడం లేదు. అయితే జాతీయపార్టీగా ప్రకటించిన సమయంలో తమిళనాడు, పుదుచ్చేరిలోనూ పోటీ చేస్తామని నేతలు చెప్పారు. కానీ తమిళనాడు ఎన్నికలు అయిపోయాయి. అక్కడి టీడీపీ పోటీనే చేయలేదు. అంటే దాదాపు జాతీయపార్టీ ఆలోచననే టీడీపీ చంపేసుకుందన్నమాట.

ఈ విషయం మీడియాలోగానీ, ప్రతిపక్షాలు గానీ విమర్శించలేదు. అందరూ మరిచిపోయారు. దీన్ని చూసి లోకేష్ లోలోన సంబరపడుతున్నారట. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీ పక్కనే ఉన్న తమిళనాడులో పోటీ చేయకపోవడంపై మీడియాలో రచ్చ జరగాల్సింది కానీ అదేమీ జరగలేదు. ఒకవేళ ఆ చర్చే జరిగి ఉంటే టీడీపీ ఇబ్బందిపడాల్సి వచ్చేది. మొత్తం మీద తమిళనాడులో పోటీ విషయాన్ని చంద్రబాబే మరిచారో లేక ఆ విషయాన్ని జనమే మరిచారో గానీ… టీడీపీలో హిమాలయాల వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న లోకేష్ మాత్రం తమిళనాడు విషయంలో బాగానే తప్పించుకున్నారు. లేకుంటే మొత్తం ఓట్లను వేళ్లమీద లెక్కపెట్టుకోవాల్సి వచ్చేదేమో..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News