మరో టాలెంట్ చూపిస్తున్న దేవిశ్రీప్రసాద్

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ఎంత టాలెంటెడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. మ్యూజిక్ డైరక్టర్ గానే కాకుండా పాటల రచయితగా, గాయకుడిగా, స్టేజ్ పర్ఫార్మర్ గా  కూడా తనదైన ముద్రవేశాడు. ఇప్పుడీ యంగ్ సెన్సేషన్ తనలోని మరో టాలెంట్ ను బయటపెడుతున్నాడు. తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ కెమెరా లెన్స్ బయటకు తీస్తున్నాడు. అవును.. దేవిశ్రీప్రసాద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. సమయం దొరికినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రదేశాల్ని క్లిక్ మనిపించడం ఇతడి హాబీ. ఆ అలవాటును అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో […]

Advertisement
Update: 2016-05-15 23:47 GMT
సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ఎంత టాలెంటెడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. మ్యూజిక్ డైరక్టర్ గానే కాకుండా పాటల రచయితగా, గాయకుడిగా, స్టేజ్ పర్ఫార్మర్ గా కూడా తనదైన ముద్రవేశాడు. ఇప్పుడీ యంగ్ సెన్సేషన్ తనలోని మరో టాలెంట్ ను బయటపెడుతున్నాడు. తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ కెమెరా లెన్స్ బయటకు తీస్తున్నాడు. అవును.. దేవిశ్రీప్రసాద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. సమయం దొరికినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రదేశాల్ని క్లిక్ మనిపించడం ఇతడి హాబీ. ఆ అలవాటును అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో త్వరలోనే
తన ఫోటోగ్రాఫ్స్ తో ఓ వెబ్ సైట్ ఏర్పాటుచేస్తానంటున్నాడు దేవిశ్రీప్రసాద్. ఆ వెబ్ సైట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని చెప్పనప్పటికీ… అందులో తను తీసిన ఫొటోలతో పాటు స్టార్స్ తో తీసుకున్న సెల్ఫీలు కూడా ఉంటాయని ప్రకటించాడు. ఇది కేవలం తన అభిరుచిని నలుగురితో పంచుకునేందుకు మాత్రమేనని తెలిపిన దేవి… ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదని ప్రకటించాడు. కేవలం తన ఆల్బమ్స్ లోనే ఉండిపోయే ఫొటోల్ని నలుగురితో పంచుకోవడం నిజంగా గొప్ప విషయమే కదా.
Advertisement

Similar News