మెగా హీరోలే ఈ అమ్మాయి టార్గెట్

పరిశ్రమకు ఎవరు కొత్తగా వచ్చినా ఫస్ట్ చూసేది మెగా కాంపౌండ్ వైపు. మెగా హీరోల సరసన నటిస్తే ఆ కిక్కే వేరు. ఆ తర్వాత వచ్చే క్రేజే వేరు. అందుకే కొత్తగా ఎంట్రీ ఇచ్చే భామలతో మెగా కాంపౌండ్ వైపే అడుగులు వేస్తుంటారు. చూపులు చూస్తుంటారు. తాజాగా మెహరీన్ కూడా అదే పని చేసింది. నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ… సాయిధర్మతేజ కొత్త సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. […]

Advertisement
Update: 2016-05-13 00:16 GMT
పరిశ్రమకు ఎవరు కొత్తగా వచ్చినా ఫస్ట్ చూసేది మెగా కాంపౌండ్ వైపు. మెగా హీరోల సరసన నటిస్తే ఆ కిక్కే వేరు. ఆ తర్వాత వచ్చే క్రేజే వేరు. అందుకే కొత్తగా ఎంట్రీ ఇచ్చే భామలతో మెగా కాంపౌండ్ వైపే అడుగులు వేస్తుంటారు. చూపులు చూస్తుంటారు. తాజాగా మెహరీన్ కూడా అదే పని చేసింది. నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ… సాయిధర్మతేజ కొత్త సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. బీవీఎస్ రవి దర్శకత్వంలో త్వరలోనే ఇది సెట్స్ పైకి రానుంది. మరోవైపు మరో మెగా హీరో అల్లు శిరీష్ కొత్త సినిమాలో కూడా మెహరీన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్… ఓ డిఫరెంట్ కథతో, సరికొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ కూడా మెహరీన్ కు అవకాశమిచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఇలా మెగా హీరోలంతా మెహరీన్ వెంట పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె మాత్రం అంత సంతృప్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. మెగా కాంపౌండ్ అంటే పవన్ కల్యాణ్ కాకపోయినా.. కనీసం చెర్రీ, బన్నీ అయినా అవకాశం ఇస్తారని మెహరీన్ ఎదురుచూస్తోంది.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News