ఏపీ ఎంసెట్లో టీ విద్యార్థుల హవా, ఫస్ట్ ర్యాంకు వంశీకృష్ణారెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు టాప్ టెన్ లో నిలిచారు. మహబూబ్ నగర్ నుంచి ఒక విద్యార్థి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. మొదటి ర్యాంకు వంశీకృష్ణారెడ్డి సాధించాడు. రెండో ర్యాకు లక్మీనారాయణ సొంతం చేసుకున్నారు. టాప్ టెన్ లో ఉన్న విద్యార్థులంతా అబ్బాయిలే కావడం గమనార్హం. నీట్ను తప్పనిసరి […]

Advertisement
Update: 2016-05-09 11:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు టాప్ టెన్ లో నిలిచారు. మహబూబ్ నగర్ నుంచి ఒక విద్యార్థి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. మొదటి ర్యాంకు వంశీకృష్ణారెడ్డి సాధించాడు. రెండో ర్యాకు లక్మీనారాయణ సొంతం చేసుకున్నారు. టాప్ టెన్ లో ఉన్న విద్యార్థులంతా అబ్బాయిలే కావడం గమనార్హం. నీట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెడికల్ ఫలితాలను నిలిపేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

1. సత్తి వంశీకృష్ణారెడ్డి(158)
2. చప్పిడి లక్ష్మీనారాయణ(157)
3. కొండా విఘ్నేష్‌రెడ్డి(157)
4. ప్రశాంత్‌రెడ్డి(156)
5. గంటా గౌతమ్‌(156)
6. దిగుమర్తి చేతన్‌ సాయి(155)
7. తాళ్లూరి సాయితేజ(154)
8. అజయ్‌ జార్జ్‌(154)
9. సాయి దినేష్‌(154)
10. నంబూరి జయకృష్ణసాయి(154)

రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని, ఇంత వేగంగా ఫలితాలు విడుదలకు కృషి చేసిన అందరికీ మంత్రి గంటా అభినందనలు తెలిపారు. ఇంజినీరింగ్‌లో గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 10 శాతం తగ్గింది.

click on Image to Read:

Tags:    
Advertisement

Similar News