టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు . గాలి ముద్దుకృష్ణమనాయుడు, జలీల్ ఖాన్, బోండా ఉమ,గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముద్దుకృష్ణమ ఏకంగా వెంకయ్య, అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోయినా టీడీపీ మౌనంగా ఉంటుందని అనుకోవద్దని హెచ్చరించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని జలీల్ ఖాన్ విమర్శించారు. ఇలా బీజేపీపై టీడీపీ […]

Advertisement
Update: 2016-05-06 03:50 GMT

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు . గాలి ముద్దుకృష్ణమనాయుడు, జలీల్ ఖాన్, బోండా ఉమ,గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముద్దుకృష్ణమ ఏకంగా వెంకయ్య, అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హోదా ఇవ్వకపోయినా టీడీపీ మౌనంగా ఉంటుందని అనుకోవద్దని హెచ్చరించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని జలీల్ ఖాన్ విమర్శించారు. ఇలా బీజేపీపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు బీజేపీకి అగ్రనాయకత్వానికి రిపోర్టుల రూపంలో చేరుతుండడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. శుక్రవారం సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బీజేపీపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. కేవలం టీడీపీ ప్రత్యేకహోదా సాధనలో ఎక్కడా రాజీపడడం లేదన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు.

బీజేపీని విమర్శించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బీజేపీని తిట్టడం మానేసి విభజన పాపం కాంగ్రెస్దే అన్న భావనను ప్రజల్లో కలిగించాలని ఆదేశించారు. ఎన్నో కష్టాలున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ చేస్తున్న కృషిని వివరించాలని ఆదేశించారు. కావాలంటే మరిన్ని సార్లు ఢిల్లీ వెళ్లి హోదా కోసం విజ్ఞప్తి చేద్దామని సూచించారు. చంద్రబాబు చెప్పినట్టు చేస్తే కేంద్రం కరుణిస్తుందా అన్నది అనుమానమే, ఎలాంటి ఒత్తిడి చేయకుండా, విజ్ఞప్తులతో కేంద్రం దిగివచ్చే పరిస్థితే ఉంటే రెండేళ్లలోనే ప్రత్యేకహోదా ఇచ్చే వైపుగా కేంద్రం అడుగులు వేసి ఉండేది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News