రేప్ పై ప్రియమణి రియాక్షన్- నెటిజన్ల ఆగ్రహం

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో న్యాయవిద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే… మరో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలనే ముగ్గురు వ్యక్తుల సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేరళలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రియమణి ట్వీట్టర్లో స్పందించారు. అయితే ఆమె చేసిన కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ‘మరో రేప్ అండ్ మర్డర్ గురించి తెలిసి షాక్ అయ్యా. దేశంలో మహిళలకు భద్రత ఉంటుందని అనుకోవడం లేదు. రేప్ చేయడం కోసం బెంగళూరులో ఓ అమ్మాయిని కిడ్నాప్ […]

Advertisement
Update: 2016-05-05 00:09 GMT

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో న్యాయవిద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే… మరో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలనే ముగ్గురు వ్యక్తుల సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేరళలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రియమణి ట్వీట్టర్లో స్పందించారు. అయితే ఆమె చేసిన కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ‘మరో రేప్ అండ్ మర్డర్ గురించి తెలిసి షాక్ అయ్యా. దేశంలో మహిళలకు భద్రత ఉంటుందని అనుకోవడం లేదు. రేప్ చేయడం కోసం బెంగళూరులో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇక్కడి పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. . ఇండియా ఇక ఎంతమాత్రం భద్రత గలదేశం కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశంలోని మహిళలు దేశాన్ని వదిలేసి వెళ్లడం మంచిది. ఎక్కడైనా భద్రత ఉన్న చోటకు వెళ్లిపోవడం మంచిది అని ట్వీట్ చేసింది ప్రియమణి.

మహిళలపై దాడుల విషయంలో ప్రియమణి ఆందోళనలో అర్థం ఉన్నా ఏకంగా దేశాన్ని వదిలేసి వెళ్లండి అని మహిళలకు పిలుపునివ్వడంపై నెగిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని కించపరిచేలా ప్రియమణి వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ప్రపంచంలో భారత్ ఒక్కటే భద్రత లేని దేశం అన్నట్టుగా ప్రియమణి స్పందన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్వీట్ పై విమర్శలు రావడంతో ప్రియమణి స్పందించారు. తాను దేశానికి వ్యతిరేకంగా మాట్లడలేదని… జరుగుతున్న ఘటనలపై అభిప్రాయం మాత్రమే చెప్పానన్నారు. అది దేశానికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నించారామె. . దీంతో “నేను ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పటికే జరిగిన ఇంకా జరుగుతున్న సంఘటనలపై నా అభిప్రాయాలను మాత్రమే చెప్పాను. ఇది దేశానికి వ్యతిరేకం ఎలా అవుతుంది ?” అంటూ మరో ట్వీట్ చేసి నిలదీసింది ప్రియమణి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News