అసలు ఏపీని విభజించిందే మేం కాదు- హోదాపై జైట్లీ ప్రకటన

”ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది ఆర్థిక శాఖ సహాయ మంత్రే కదా.. ఆ విషయం ఆర్ధిక మంత్రి చెప్పలేదు… ప్రధాన మంత్రి చెప్పలేదు. కాబట్టి ఎదురు చూడాలి”. ఇది టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ బుధవారం చేసిన ప్రకటన. అయితే ఇప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంట్లో స్పందించారు.  ఆ ఒక్కటి అడగద్దు అన్నట్టుగా  ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పడేశారు. ‘విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయింది. హైద్రాబాద్‌ని కోల్పోవడంతో   ఆర్థిక ఇబ్బందులు […]

Advertisement
Update: 2016-05-05 03:11 GMT

”ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది ఆర్థిక శాఖ సహాయ మంత్రే కదా.. ఆ విషయం ఆర్ధిక మంత్రి చెప్పలేదు… ప్రధాన మంత్రి చెప్పలేదు. కాబట్టి ఎదురు చూడాలి”. ఇది టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ బుధవారం చేసిన ప్రకటన. అయితే ఇప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంట్లో స్పందించారు. ఆ ఒక్కటి అడగద్దు అన్నట్టుగా ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పడేశారు.

‘విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయింది. హైద్రాబాద్‌ని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఆ ఇబ్బందుల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం. ప్రతి పైసా ఇస్తాం అంటూ ప్రకటనలో సరిపెట్టారు. 2015-16లో రూ. 21 వేల 900 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2014-15లో రూ. 13 వేల కోట్ల లోటు ఉన్నట్టుగా ఏపీ చెప్పిందని దాన్ని పరిశీలించి నిధులు చెల్లిస్తామంటూ సానుభూతి మాటలతో సరిపెట్టారు.

అసలు రాష్ట్రాన్ని విభజించింది తాము కాదని యూపీఏ అని చెప్పి ఇన్ డైరెక్ట్ గా తమను తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదని అరుణ్ జైట్లీ తేల్చేశారు. పోలవరంపై కమిట్ మెంట్ తో ఉన్నామని చెప్పారు. అయితే ప్రత్యేకహోదా ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. కనీసం ఆ ఊసే ఎత్తలేదు. మొత్తం మీద చూస్తుంటే ప్రత్యేక హోదా ఇచ్చే యోచన కేంద్రానికి ఒక్కశాతం కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు అటోఇటో తేల్చుకోవాల్సింది ఏపీ ప్రభుత్వం, చంద్రబాబే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News