"ఇది అమరావతి... కొంటే లోకల్ వాడే కొనాలి"

ఏపీ రాజధాని అమరావతి ల్యాండ్ మాఫియా గుప్పిట్లో చిక్కుకుంటోంది. అమరావతిలో భూములపై కబ్జా ముఠాలు రాబందుల్లా వాలిపోతున్నాయి. సదరు రాబందులను తరిమివేయడం పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. ముఖ్యంగా స్థానికంగా లేని వారు, ఎన్ఆర్ ఐ భూములు ఈజీ టార్గెట్‌గా మారాయి. గుంటూరు జిల్లా పెద్దకూర‌పాడుకు చెందిన ఎన్ఆర్ఐ ఉన్న‌వ బుల్ల‌య్య చౌద‌రికి చెందిన ఐదు ఎక‌రాల 30 సెంట్ల భూమిని కొంద‌రు క‌బ్జా చేసేశారు. త‌ప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి జెండా పాతేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా […]

Advertisement
Update: 2016-05-01 01:15 GMT

ఏపీ రాజధాని అమరావతి ల్యాండ్ మాఫియా గుప్పిట్లో చిక్కుకుంటోంది. అమరావతిలో భూములపై కబ్జా ముఠాలు రాబందుల్లా వాలిపోతున్నాయి. సదరు రాబందులను తరిమివేయడం పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. ముఖ్యంగా స్థానికంగా లేని వారు, ఎన్ఆర్ ఐ భూములు ఈజీ టార్గెట్‌గా మారాయి. గుంటూరు జిల్లా పెద్దకూర‌పాడుకు చెందిన ఎన్ఆర్ఐ ఉన్న‌వ బుల్ల‌య్య చౌద‌రికి చెందిన ఐదు ఎక‌రాల 30 సెంట్ల భూమిని కొంద‌రు క‌బ్జా చేసేశారు. త‌ప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి జెండా పాతేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా నిందితుల‌ను అరెస్ట్ చేయ‌డానికి 8నెల‌లు తీసుకున్నార‌ని బాధితుడు చెబుతున్నారు. ఇలా నిత్యం అమ‌రావ‌తి ప‌రిధిలో ఎదో ఒక చోట క‌బ్జా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.

రాజ‌ధానిలో భూవివాదాలు పెరిగిన మాట వాస్త‌వ‌మేన‌ని గుంటూరు రూర‌ల్ ఎస్పీ కూడా చెప్పారు. భూముల ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల అనిల్ కుమార్ అనే వ్య‌క్తి టీడీపీ మంత్రులు త‌న బంధువులంటూ దందాలు చేస్తూ దొరికిపోయారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని ఎన్ఆర్ఐలు, స్థానికేత‌రుల స్థ‌లాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు అధికార పార్టీ అండ‌దండ‌ల‌తో భూముల‌ను క‌బ్జా పెడుతున్నార‌న్న భావ‌న కూడా బ‌లంగా ఉంది. రాజ‌ధానిలో ఎన్ఐఆర్‌ల భూముల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ జాతీయ ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా క‌థ‌నాలు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌రిస్థితి ఇలాగే ఉంటే రాజ‌ధాని బ్రాండ్ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News