ఢిల్లీ రోడ్ల‌పైకి... పెట్రోల్‌, డీజిల్ లేని కార్లు!

ఢిల్లీ న‌గ‌రంలో పెట్రోలు, డీజిల్ ఉప‌యోగించ‌ని కార్లు రోడ్ల‌పైకి రానున్నాయి. ఈ మేర‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ కార్ల‌ను సిఎన్‌జి (కంప్రెస్ప్‌డ్ నేచుర‌ల్ గ్యాస్‌) కార్లుగా మార్చుకునే గ‌డుపుని పెంచ‌మంటూ ప్ర‌యివేటు ట్యాక్సీల‌ డ్రైవ‌ర్లు సుప్రీం కోర్టుని ఆశ్ర‌యించ‌గా ,  కోర్టు వారి కోరికని తిర‌స్క‌రించింది. గ‌డువు తేదీ ఈ నెల ముప్ప‌యి కాగా మే ఒక‌టి నుండి రోడ్ల‌మీద‌కు సిఎన్‌జి వాహ‌నాలు రావాల‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొంది. డీజిల్ […]

Advertisement
Update: 2016-04-30 00:11 GMT

ఢిల్లీ న‌గ‌రంలో పెట్రోలు, డీజిల్ ఉప‌యోగించ‌ని కార్లు రోడ్ల‌పైకి రానున్నాయి. ఈ మేర‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ కార్ల‌ను సిఎన్‌జి (కంప్రెస్ప్‌డ్ నేచుర‌ల్ గ్యాస్‌) కార్లుగా మార్చుకునే గ‌డుపుని పెంచ‌మంటూ ప్ర‌యివేటు ట్యాక్సీల‌ డ్రైవ‌ర్లు సుప్రీం కోర్టుని ఆశ్ర‌యించ‌గా , కోర్టు వారి కోరికని తిర‌స్క‌రించింది. గ‌డువు తేదీ ఈ నెల ముప్ప‌యి కాగా మే ఒక‌టి నుండి రోడ్ల‌మీద‌కు సిఎన్‌జి వాహ‌నాలు రావాల‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొంది. డీజిల్ కార్ల‌ను సిఎన్‌జి వినియోగించే కార్లుగా మార్చ‌డానికి అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీ అందుబాటులో లేద‌ని, మ‌రికొంత గ‌డువు కావాల‌ని టాక్సీ డ్రైవ‌ర్లు కోర్టుని కోర‌గా, గ‌డుపు పెంచేది లేద‌ని, వారికి త‌గిన స‌మ‌యం ఇచ్చామని కోర్టు తెలిపింది. ఆల్ ఇండియా ప‌ర్మిట్ ఉన్న కార్ల‌కు ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News