తిరుమలపై కన్నేసిన మురళీమోహన్

టీటీడీ పాలక మండలి పదవి కాలం ముగుస్తుండడంతో మళ్లీ రేసు మొదలైంది.  ఈసారి ఎలాగైనా టీటీడీ చైర్మన్‌ గిరిని సొంతం చేసుకునేందుకు పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీటీడీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన  టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలి గతేడాది మే1న ప్రమాణ స్వీకారం చేసింది. ఏడాది పాటు పాలకమండలి కొనసాగుతుందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో కొత్తగా పాలన మండలిని నియమిస్తారా లేక ఇప్పుడున్న పాలకమండలినే కొనసాగిస్తారా […]

Advertisement
Update: 2016-04-28 22:40 GMT

టీటీడీ పాలక మండలి పదవి కాలం ముగుస్తుండడంతో మళ్లీ రేసు మొదలైంది. ఈసారి ఎలాగైనా టీటీడీ చైర్మన్‌ గిరిని సొంతం చేసుకునేందుకు పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీటీడీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలి గతేడాది మే1న ప్రమాణ స్వీకారం చేసింది.

ఏడాది పాటు పాలకమండలి కొనసాగుతుందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్తగా పాలన మండలిని నియమిస్తారా లేక ఇప్పుడున్న పాలకమండలినే కొనసాగిస్తారా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అయితే తనను చైర్మన్‌గా నియమించాలని రాజమండ్రి ఎంపీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీమోహన్ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతో గురువారమే సీఎంను మురళీమోహన్ కలిశారని చెబుతున్నారు.

మురళీమోహన్‌తో పాటు ఎప్పటి నుంచో టీటీడీ చైర్మన్ పదవి కోసం తపిస్తున్న నరసరావుపేట ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రాయపాటి సాంబశివరావు కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పేరు కూడా రేసులో వినపడుతోంది. ఆయన బీజేపీ నేతల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. అయితే పారిశ్రామికవేత్తలను టీటీడీ చైర్మన్ గా నియమించవచ్చవద్దని గట్టి డిమాండ్ ఉంది. చైర్మన్ గిరిని వారు స్వప్రయోజనాలకు, పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వాడుకుంటారన్న విమర్శ ఉంది. చైర్మన్ గిరికి పోటీ ఎక్కువవడంతో ఇప్పుడున్న చైర్మన్‌నే కొనసాగిస్తే సరిపోతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం.

మరోఏడాదిపాటు పాలక మండలి పదవికాలం పొడిగించే అవకాశం ఉందంటున్నారు. అయితే అలా చేయకుండా మురళీమోహన్‌, రాయపాటి లాంటి వారు ఒత్తిడి కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. పాలకమండలిలోని కొందరు సభ్యులకు మాత్రం ఉద్వాసన తప్పకపోవచ్చని అంటున్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే సాయన్న సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో సాయన్న ప్లేస్‌లో మరొకరికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News