అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేశాడు....

ఓ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కనీసం నెల రోజులైనా గ్యాప్ తీసుకోవడం పవన్ కు అలవాటు. ఆ నెలరోజులు ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లిపోతాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మీసాలు, గడ్డాలు పెంచేస్తాడు. కనీసం ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతగా అజ్ఞాతంలోకి జారుకుంటాడు. కానీ ఈసారి మాత్రం పవన్ అలా చేయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయిన వెంటనే…. మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఆ సినిమా విడుదలై కనీసం నెల రోజులైనా కాకముందే […]

Advertisement
Update: 2016-04-27 23:59 GMT
ఓ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కనీసం నెల రోజులైనా గ్యాప్ తీసుకోవడం పవన్ కు అలవాటు. ఆ నెలరోజులు ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లిపోతాడు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మీసాలు, గడ్డాలు పెంచేస్తాడు. కనీసం ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతగా అజ్ఞాతంలోకి జారుకుంటాడు. కానీ ఈసారి మాత్రం పవన్ అలా చేయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయిన వెంటనే…. మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఆ సినిమా విడుదలై కనీసం నెల రోజులైనా కాకముందే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ నటించనున్న కొత్త సినిమాకు పూజాకార్యక్రమాలు ముగిశాయి. నిర్మాత శరత్ మరార్ ఆఫీస్ లో పలువురు ప్రముఖుల సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండా సినిమాను ప్రారంభించేశారు. అయితే పవన్ ఇంత త్వరగా మరో సినిమా స్టార్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుందా అని చాలా మంది ఆలోచించారు. కానీ దీనివెనక కారణం ఒకటే. సర్దార్ గబ్బర్ సింగ్ తో నష్టాలపాలైన నిర్మాత శరత్ మరార్ ను ఆదుకోవాలి. కేవలం ఆ ఒకేఒక్క ఉద్దేశంతో వెంటనే మరో సినిమా స్టార్ట్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ ఎస్ జే సూర్యకే మళ్లీ అవకాశం ఇవ్వడం అభిమానులకు మింగుడు పడడం లేదు.
Advertisement

Similar News