ఆరు వారాల పాటు అశ్లీల చిత్రాలను పరిశీలించండి!

కండోమ్స్ ప్యాకెట్లపై మహిళల అసభ్య ఫోటోలను ముద్రించడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అలా ముద్రించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని భావిస్తోంది. ఇలాంటి అశ్లీల బొమ్మలతో ప్రకటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని..’ఆరు వారాలు ఆ ప్రకటనలను నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పాల్సిందిగా అడిసినల్ సోలిసిటర్ జనరల్‌ను సుప్రీం ఆదేశించింది. ఏఎస్ జీ మాత్రం దీనిపై మీడియాతో […]

Advertisement
Update: 2016-04-26 21:00 GMT

కండోమ్స్ ప్యాకెట్లపై మహిళల అసభ్య ఫోటోలను ముద్రించడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అలా ముద్రించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని భావిస్తోంది. ఇలాంటి అశ్లీల బొమ్మలతో ప్రకటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని..’ఆరు వారాలు ఆ ప్రకటనలను నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పాల్సిందిగా అడిసినల్ సోలిసిటర్ జనరల్‌ను సుప్రీం ఆదేశించింది.

ఏఎస్ జీ మాత్రం దీనిపై మీడియాతో స్పందించేందుకు విముఖత ప్రదర్శించారు. మంగళవారం సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయని మాత్రం ఆయన కార్యాలయం తెలిపింది. ఏఎస్‌జీ ప్రభుత్వ పరంగా మూడో అత్యున్నత న్యాయాధికారి కావడంతో కాండోమ్ ప్రకటనలపై ఆయన ఎలాంటి సూచనలు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. కండోమ్స్ కంపెనీలు తమ ప్రొడక్ట్‌ను అమ్ముకునేందుకు అశ్లీలతతో ప్రకటనలు తయారు చేస్తున్నాయి. కండోమ్స్ ప్యాకెట్లపై మహిళల దాదాపు నగ్న చిత్రాలను ముద్రిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం స్పందించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News