పరిటాల పెళ్లి సందడి- ప్రచారమంత విలువ చేయదా?

అనంతపురం జిల్లాలో  రాజకీయ నాయకులు ఏటా వందలాది ఉచిత వివాహాలను చేస్తుంటారు. ఈ కోవలోకి అన్ని పార్టీల నాయకులు వస్తారు. రాయదుర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఏటా వందలాది వివాహాలు చేయిస్తుంటారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన చిన్నపాటి లీడర్లు కూడా తమ శక్తిమేర వందలాది వివాహాలు ఏటా చేయిస్తుంటారు. కానీ వారి వివాహాలకు ఎక్కడా పబ్లిసిటీ ఉండదు. ఏదో పత్రికల జిల్లా ఎడిషన్‌లో ఒక పూట చిన్న ఆర్టికల్ రాసి వదిలేస్తారు. […]

Advertisement
Update: 2016-04-23 07:13 GMT

అనంతపురం జిల్లాలో రాజకీయ నాయకులు ఏటా వందలాది ఉచిత వివాహాలను చేస్తుంటారు. ఈ కోవలోకి అన్ని పార్టీల నాయకులు వస్తారు. రాయదుర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఏటా వందలాది వివాహాలు చేయిస్తుంటారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన చిన్నపాటి లీడర్లు కూడా తమ శక్తిమేర వందలాది వివాహాలు ఏటా చేయిస్తుంటారు. కానీ వారి వివాహాలకు ఎక్కడా పబ్లిసిటీ ఉండదు. ఏదో పత్రికల జిల్లా ఎడిషన్‌లో ఒక పూట చిన్న ఆర్టికల్ రాసి వదిలేస్తారు. అయితే ఉచిత వివాహాల్లో పరిటాల వారి ఉచిత వివాహాలు వేరు.

పరిటాల వారి ఉచిత వివాహాల ఘట్టానికి వచ్చినంత పబ్లిసిటీ .. టీటీడీ రాష్ట్రవ్యాప్తంగా చేసే ఉచిత వివాహాలకు కూడా ఉండదు. ఏక కాలంలో లక్షలాది వివాహాలు జరుతున్నాయన్నంతగా మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది కూడా అదే రేంజ్‌లో ప్రచారం చేసి పెట్టాయి టీడీపీ అనుకూల టీవీ చానళ్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈసారి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తీరా అక్కడ జరిగిన పెళ్లిళ్ల సంఖ్య 250 మాత్రమే. 250 జంటలు ఏకమయ్యే కార్యక్రమానికి ఇంత పబ్లిసిటీ, ఈ రేంజ్లో హడావుడిగా అని లోకల్ జనం ఆశ్చర్యపోతున్నారట.

రూపాయి పనికి వెయ్యి రూపాయల ప్రచారం ఏమిటోనని చర్చించుకుంటున్నారు. లోకల్‌లో చాలా మంది నేతలు ఉచిత వివాహాలు చేయిస్తారు గానీ.. ఒక్క పరిటాల ఉచిత పెళ్లిళ్లలకు మాత్రమే ఎందుకింత పబ్లిసిటీ వస్తోందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే టీడీపీ మీడియా అత్యుత్సహం వల్లే ఈ రేంజ్ పబ్లిసిటీ వస్తోందని కాసింత లోతుగా స్టడీ చేసిన వారు చెబుతున్నారు. ఏది ఏమైనా పేదల కోసం ఉచిత వివాహాలు జరిపించడం అభినందించాల్సిన అంశమే.

Click on Image to Read:

Advertisement

Similar News