టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే, హోటల్‌ కోసమేనా?

అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీలో చేరారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం స్వీకరించారు. గత రాత్రే విజయవాడ చేరుకున్న బాషా ఉదయం సీఎంను కలిశారు. కొద్ది రోజుల క్రితమే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చాంద్ బాషా గట్టిగా మాట్లాడారు. ఇంతలోనే పార్టీ మారారు. 2014 ఎన్నికల ముందు వరకు చాంద్ బాషా టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ మైనార్టీ విభాగంలో బాధ్యతలు కూడా నిర్వహించారు. తీరా ఎన్నికల సమయంలో టీడీపీ సీటు […]

Advertisement
Update: 2016-04-22 23:48 GMT

అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీలో చేరారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం స్వీకరించారు. గత రాత్రే విజయవాడ చేరుకున్న బాషా ఉదయం సీఎంను కలిశారు. కొద్ది రోజుల క్రితమే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చాంద్ బాషా గట్టిగా మాట్లాడారు. ఇంతలోనే పార్టీ మారారు.

2014 ఎన్నికల ముందు వరకు చాంద్ బాషా టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ మైనార్టీ విభాగంలో బాధ్యతలు కూడా నిర్వహించారు. తీరా ఎన్నికల సమయంలో టీడీపీ సీటు నిరాకరించడంతో వైసీపీలో చేరారు. కదిరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే చాంద్ బాషా రేటు ఇతర ఎమ్మెల్యేల స్థాయిలో పలకలేదని చెబుతున్నారు. తక్కువ కోట్ల రూపాయలకే ఆయన టీడీపీలో చేరిపోయారంటున్నారు. పైగా కదిరిలో అత్తార్ బాషాకు అత్తార్ రెసిడెన్సీ పేరుతో ఒక హోటల్‌ ఉంది. అది కూడా తాకట్టులో ఉందని చెబుతున్నారు. దాన్ని విడిపించుకుని ఆర్థికంగా గట్టేక్కేందుకే ఆయన పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు. చాంద్ బాషా ఫిరాయింపుతో రాజీనామా చేయకుండానే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News