వైసీపీని ఇప్పుడేం అంటారో?

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో వైసీపీ తన స్టాండ్ ప్రకటించింది.  పదవిలో ఉండి చనిపోయిన వ్యక్తి స్థానంలో  వారి కుటుంబసభ్యులు బరిలో దిగితే పోటీగా అభ్యర్థిని నిలపకూడదని తొలి నుంచి పెట్టుకున్న నియమాన్ని వైసీపీ ఫాలో అయింది. ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపబోమని… తమ మద్దతు వెంకటరెడ్డి కుటుంబానికే ఉంటుందని వైసీపీ ప్రకటించింది. లోటస్ పాండ్‌లో తనను కలిసిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు జగన్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు.  మిగిలిన పార్టీలు కూడా […]

Advertisement
Update: 2016-04-22 08:04 GMT

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో వైసీపీ తన స్టాండ్ ప్రకటించింది. పదవిలో ఉండి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారి కుటుంబసభ్యులు బరిలో దిగితే పోటీగా అభ్యర్థిని నిలపకూడదని తొలి నుంచి పెట్టుకున్న నియమాన్ని వైసీపీ ఫాలో అయింది. ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపబోమని… తమ మద్దతు వెంకటరెడ్డి కుటుంబానికే ఉంటుందని వైసీపీ ప్రకటించింది.

లోటస్ పాండ్‌లో తనను కలిసిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు జగన్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు. మిగిలిన పార్టీలు కూడా వెంకటరెడ్డి కుటుంబానికే మద్దతు ఇవ్వాలని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అయితే కొద్దికాలం క్రితం ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా బరిలో దిగింది. అప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. టీఆర్ఎస్‌ తో వైసీపీ కుమ్మకైందని అందుకే విపక్షాల ఓట్లు చీల్చేందుకు అభ్యర్ధిని బరిలో దింపారంటూ తిట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జగన్‌ను మద్దతు కోరడం, ఆయన చనిపోయిన వారి విషయంలో పోటీ పెట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడి బరిలో ఉండబోమని ప్రకటించారు.

గతంలో వైసీపీపై చేసిన విమర్శలు ఇప్పుడు టీడీపీ, కమ్యూనిస్టులకూ వర్తిస్తాయి. నిజంగా అధికార పార్టీని ఓడించాలని టీడీపీ, కమ్యూనిస్టులు భావిస్తే పాడేరు ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలి. ఎందుకంటే అక్కడ చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కాంగ్రెస్‌ వారే. కానీ ఖమ్మం ఎమ్మెల్సీ, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీల్చేందుకే వైసీపీ పోటీలో దిగిందని విమర్శలు చేసిన టీడీపీ, ఇతర పార్టీలు ఇప్పుడు మాత్రం పోటీ చేస్తామంటున్నాయి. అంటే ఇప్పుడు విపక్షాల ఓట్లు చీల్చి టీఆర్ఎస్‌ అభ్యర్థి తుమ్ముల నాగేశ్వరరావును గెలిపించేందుకు టీడీపీ, ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయా?

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News