జనతా గ్యారేజీలో మిల్కీబ్యూటీ

అదేంటి హెడ్డింగ్ తప్పుగా రాశారు.. జనతా గ్యారేజీలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు కదా… మధ్యలో తమన్నా పేరు రాశారేంటి అనుకుంటున్నారా…. హెడ్డింగ్ తప్పుగా రాయలేదు. మీరు చదివింది నిజమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనతా గ్యారేజీ సినిమాలో తమన్న కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భారీ తారాగణంతో భారీగా కనిపిస్తున్న జనతా గ్యారేజీకి తమన్నా తోడైతే సినిమా మరింత రిచ్ గా తయారవ్వడం ఖాయం. ఇంతకీ మేటర్ ఏంటంటే… జనతా గ్యారేజీలో ఐటెంసాంగ్ కోసం తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తోంది. […]

Advertisement
Update: 2016-04-19 23:18 GMT
అదేంటి హెడ్డింగ్ తప్పుగా రాశారు.. జనతా గ్యారేజీలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు కదా… మధ్యలో తమన్నా పేరు రాశారేంటి అనుకుంటున్నారా…. హెడ్డింగ్ తప్పుగా రాయలేదు. మీరు చదివింది నిజమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనతా గ్యారేజీ సినిమాలో తమన్న కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భారీ తారాగణంతో భారీగా కనిపిస్తున్న జనతా గ్యారేజీకి తమన్నా తోడైతే సినిమా మరింత రిచ్ గా తయారవ్వడం ఖాయం.
ఇంతకీ మేటర్ ఏంటంటే… జనతా గ్యారేజీలో ఐటెంసాంగ్ కోసం తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న హీరోయిన్లలో ఐటెంసాంగ్ చేయాలంటే తమన్న తర్వాతే ఎవరైనా. ఇప్పటికే ఐటెంసాంగ్స్ చేసిన అనుభవం తమన్నాకు ఉండడం… అన్ని భాషల్లో మిల్కీబ్యూటీకి క్రేజ్ కూడా ఉండడంతో మరోసారి ఆమెను ఐటెంసాంగ్ ఆఫర్ పలకరించింది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఓ మాస్ మసాలా ఐటెంసాంగ్ లో తారక్ తో కలిసి చిందేయాల్సిందిగా ప్రపోజల్ అందింది. మరోవైపు తమన్నాతో ఉన్న పరిచయంతో…. ఎన్టీఆర్ కూడా స్వయంగా ఫోన్ చేసి అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ పై తమన్న మాత్రం ఇంకా స్పందించలేదు. ఆలోచించి చెబుతానని మాత్రం చెప్పింది. తారక్ నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఇస్తేనే ఐటెంసాంగ్ చేస్తానంటూ కండిషన్ పెట్టే ఆలోచనలో మిల్కీ బ్యూటీ ఉన్నట్టు తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News