సాక్షి చెబుతున్న సర్వే వివరాలు నిజమేనా?

త్వరలో జరగనున్న నగరపాలన సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అంతర్గత సర్వే చేయించుకుందని సాక్షి పత్రిక కథనం. అదనపు డిజీపీ ఆదేశాల మేరకు సిబ్బంది శ్రీకాకుళంలో సర్వే నిర్వహించారట. రెండు విడుతల్లో ప్రభుత్వం సర్వే చేయించిందని చెబుతున్నారు. సర్వేలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉన్నట్టుగా వెల్లడైందట.  యువత ఏం కోరుకుంటోంది?. మహిళలు ఏం అంటున్నారు?, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు?, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసిందని కథనం. ఇప్పుడున్న 36 వార్డుల్లో […]

Advertisement
Update: 2016-04-19 21:38 GMT

త్వరలో జరగనున్న నగరపాలన సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అంతర్గత సర్వే చేయించుకుందని సాక్షి పత్రిక కథనం. అదనపు డిజీపీ ఆదేశాల మేరకు సిబ్బంది శ్రీకాకుళంలో సర్వే నిర్వహించారట. రెండు విడుతల్లో ప్రభుత్వం సర్వే చేయించిందని చెబుతున్నారు. సర్వేలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉన్నట్టుగా వెల్లడైందట. యువత ఏం కోరుకుంటోంది?. మహిళలు ఏం అంటున్నారు?, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు?, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసిందని కథనం.

ఇప్పుడున్న 36 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి 17 స్థానాలకు మించి రావని సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరినట్టు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వైసీపీ 19 వార్డుల్లో గెలవడంతో పాటు మేయర్ పీఠం కూడా దక్కించుకుంటుందట. ప్రభుత్వ తీరుపై ఏ వర్గం కూడా ఆశాజనకంగా స్పందించలేదని ఇంటెలిజెన్స్ సర్వే వెల్లడించిందని చెబుతున్నారు. తొలివిడత నివేదికను చూసిన తర్వాత మరోసారి సర్వేచేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని చెబుతున్నారు.

1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని తేలిందంట. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను బట్టి, మారబోయే పరిస్థితులను బట్టి ఫలితాలుండవచ్చంటున్నారు. సర్వే నివేదికల ఆధారంగా ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలా లేక పరోక్ష పద్దతిలో నిర్వహించాలా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News