అక్షరం రాని వాడు ఆదేశిస్తున్నాడు... ఏపీలో మేం వేగలేం..

సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకవర్గం మీడియా ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి ఒక ప్రచారం చేసింది. అదేంటంటే ఐఏఎస్, ఐపీఎస్‌లంతా చంద్రబాబు సీఎం అయితే ఏపీకి వెళ్లాలని ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు గానీ, లేదంటే కేంద్ర సర్వీసులకు గానీ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారంచేసింది. ఉన్నతాధికారులు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న భావనను జనంలో కలిగించేందుకు ఒక వర్గం మీడియా ఈ ప్రచారంచేసిందని చెబుతుంటారు. అందులో నిజమెంతో గానీ ఇప్పుడు మాత్రం ఐఏఎస్‌, […]

Advertisement
Update: 2016-04-16 22:04 GMT

సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకవర్గం మీడియా ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి ఒక ప్రచారం చేసింది. అదేంటంటే ఐఏఎస్, ఐపీఎస్‌లంతా చంద్రబాబు సీఎం అయితే ఏపీకి వెళ్లాలని ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు గానీ, లేదంటే కేంద్ర సర్వీసులకు గానీ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారంచేసింది. ఉన్నతాధికారులు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న భావనను జనంలో కలిగించేందుకు ఒక వర్గం మీడియా ఈ ప్రచారంచేసిందని చెబుతుంటారు. అందులో నిజమెంతో గానీ ఇప్పుడు మాత్రం ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఏపీలో పనిచేసేందుకు జంకుతున్నారు. ఏపీలో పనిచేయడం తమ వల్ల కాదంటూ సెంట్రల్ సర్వీసుకు వెళ్లిపోయేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లు క్యూ కడుతున్నారు.

ఇలా ఏపీ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ముఖ్యకార్యదర్శి, ప్రధాన ప్రత్యేక కార్యదర్శి స్థాయి నుంచి అదనపు కలెక్టర్ వరకు ఉన్నారు. ఐపీఎస్‌ ల్లో అదనపు డీజీ స్థాయి అధికారుల నుంచి ఎస్పీల వరకూ ఉన్నారు. ఇప్పటికే అదనపు డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి వీఎస్‌కే కౌముది ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా కేంద్రసర్వీసులకు వెళ్లిపోయారు. ఈయన ట్రాక్ రికార్డును పరిశీలించిన కేంద్రం కౌముది అడిగిన పోస్టు కంటే ఉన్నతమైనదిగా భావించే ఎన్‌ఐఏలో కీలక స్థానం ఇచ్చి గౌరవించింది. మిగిలిన అధికారులు కూడా కీలకమైన స్థానం దక్కకపోయినా పర్వాలేదు, ఏపీ నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా 18 మంది అధికారులు ఇలా కేంద్రసర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. వీరు ఇలా వెళ్లిపోయేందుకు సిద్ధపడడం వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి నుంచి జన్మభూమి కమిటీ సభ్యుడు వరకు ప్రతిఒక్కరూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై సవారీ చేసేందుకు ప్రయత్నించడం వల్లే అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా చేరి ఆ పనిచేయండి… ఈ పనిచేసిపెట్టండి అంటూ ఐఏఎస్‌లనే ఆదేశిస్తున్నారట. వీలుకాదంటే వెంటనే సీఎంకు చెబుతాం… మంత్రికి చెబుతాం అంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని చెబుతున్నారు. వీల్లు చాలరన్నట్టు షాడో సీఎం కూడా మాపనులు చేయమని అధికారులను దబాయిస్తున్నాడట. అంతే కాదు సమయపాలన లేకుండా ఏకంగా ఏడెనిమిది గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ , సమీక్షలంటూ పదేపదే సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల కూడా తాము సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందని చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ గంటల తరబడి సమావేశాలని సాగదీయడం వలన అధికారులు విసిగిపోతున్నారట. పైగా కీలక మైన పోస్టింగుల్లో ప్రతిభ, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా ఒక సామాజిక‌ వర్గం అధికారులకే పెద్దపీట వేయడం ఇతర అధికారులకు తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోందని చెబుతున్నారు.

ఇలా తమకు ఐఏఎస్, ఐపీఎస్‌లన్న కనీస మర్యాద కూడా ఏపీలో దక్కడం లేదని, కాబట్టి బయటకు వెళ్లిపోవడమే మంచిదని వారు భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేంద్ర సర్వీసుల్లో అవకాశం లేని పక్షంలో కనీసం ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్ మీదనైనా పంపాలని అధికారులు వేడుకుంటున్నారు. ఈ పరిణామం రాష్ట్రానికి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు … ఐఏఎస్, ఐపీఎస్‌లపై సవారీ చేయకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News