కేసీఆర్, చంద్రబాబు ఒక్కటి కాదు

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే చారలు రావు. వాతలు పడతాయి. ఆంధ్రలో చంద్రబాబు వాలకం, గోడదూకుతున్న వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థతి అలాగే ఉంది. తెలంగాణలో కేసీఆరు చేసినట్టే నేనూ చేస్తున్నానని చంద్రబాబు మురిసిపోతున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాయాజూదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ పరిస్థతి వేరు. కేసీఆరు పరిస్థతి వేరు. ఆయన ఖజానా గలగలలాడుతున్నది. ఏదో ఒకటి చేస్తున్నాడు. జనంలో పాతుకుపోతున్నాడు. ఆయన రోజు రోజుకూ జనామోదంతో దూసుకుపోతున్నాడు. చంద్రబాబు రోజు రోజుకు జనంలో […]

Advertisement
Update: 2016-04-16 04:36 GMT

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే చారలు రావు. వాతలు పడతాయి. ఆంధ్రలో చంద్రబాబు వాలకం, గోడదూకుతున్న వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థతి అలాగే ఉంది. తెలంగాణలో కేసీఆరు చేసినట్టే నేనూ చేస్తున్నానని చంద్రబాబు మురిసిపోతున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాయాజూదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ పరిస్థతి వేరు. కేసీఆరు పరిస్థతి వేరు. ఆయన ఖజానా గలగలలాడుతున్నది. ఏదో ఒకటి చేస్తున్నాడు. జనంలో పాతుకుపోతున్నాడు. ఆయన రోజు రోజుకూ జనామోదంతో దూసుకుపోతున్నాడు. చంద్రబాబు రోజు రోజుకు జనంలో పలుచబడతున్నాడు. పోయిన ఎన్నికల్లోనే ఆయన చావుతప్పి కన్నులొట్టపోయింది.

నరేంద్రమోడి గాలి, పవన కల్యాణ్ ఆవేశం, విభజన బాధ అన్నీ కలిసి చంద్రబాబును గట్టెక్కించాయి. జగన్ ఒంటరిగానే వీరందరినీ ఎదిరించి నిలబడి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రానున్న కాలమంతా చంద్రబాబుకు గడ్డుకాలమే. వచ్చే ఎన్నికల నాటికి మోడీ ఏం చేస్తాడో తెలియదు. పవన కల్యాణుడు ఏమి చేస్తాడో తెలియదు. విభజన మంచిదే అని అంటున్నాడు. బాబుకు వ్యతిరేకంగా జగన్, వామపక్షాలు, కాంగ్రెస్ అంతా ఒక్కటయితే పరిస్థతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చంద్రబాబు మోసం చేశాడన్న భావన ఇప్పటికే జనంలో బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం తమకు ఏ పనులూ కావడం లేదని అసంతృప్తితో ఉంది. రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఏరిఏరి తొక్కేస్తున్నాడు. ఈ రెండు సామాజిక వర్గాలు ఒక్కతాటిపైకి వస్తే చంద్రబాబు పని అయిపోయినట్టే. నాయకులు మారినంత మాత్రాన జనం మారడం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News