ఎట్టకేలకు బయటపడిన పవన్ కల్యాణ్

రామ్ గోపాల్ వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ కు చాలా కోపం ఉంది. ఎప్పుడు చూసిన ట్వీట్స్ తో పవన్ ను కెలుకుతూ కనిపిస్తాడు వర్మ. అలాంటి వర్మపై తొలిసారి స్పందించాడు పవన్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు రెండో విడత పబ్లిసిటీ ప్రారంభించిన పవన్… వర్మపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నాడు. వర్మ అంటే తనకు ఇష్టమని, అలాగని తనకు ప్రేమలేఖలు రాయాలా అని రివర్స్ లో ప్రశ్నించాడు. ఆయన ప్రతి […]

Advertisement
Update: 2016-04-11 23:37 GMT
రామ్ గోపాల్ వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ కు చాలా కోపం ఉంది. ఎప్పుడు చూసిన ట్వీట్స్ తో పవన్ ను కెలుకుతూ కనిపిస్తాడు వర్మ. అలాంటి వర్మపై తొలిసారి స్పందించాడు పవన్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు రెండో విడత పబ్లిసిటీ ప్రారంభించిన పవన్… వర్మపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నాడు. వర్మ అంటే తనకు ఇష్టమని, అలాగని తనకు ప్రేమలేఖలు రాయాలా అని రివర్స్ లో ప్రశ్నించాడు. ఆయన ప్రతి ట్వీట్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, అలా చేస్తే భవిష్యత్తులో దారినపోయే దానయ్య చేసే ట్వీటుకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని….పరోక్షంగా వర్మపై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా వర్మకు తనకు మధ్య జరిగిన ఓ సంఘటనను కూడా పవన్ ప్రస్తావించారు. వైఫ్ ఆఫ్ వ‌ర‌ప్ర‌సాద్ సినిమా క‌థ వ‌ర్మ త‌నకు చెప్పార‌ని… అయితే ఆ కథ చెత్తగా ఉందని ముఖం మీదే చెప్పాన‌ని ప‌వ‌న్ గ‌తాన్ని గుర్తు చేశారు. దీంతో హ‌ర్ట‌యిన వ‌ర్మ‌..మీ త‌మ్ముడుకు చాలా పొగ‌ర‌ని అన్న‌య్య ద‌గ్గ‌ర అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడ‌ని చెప్పుకొచ్చారు. వ‌ర‌ప్ర‌సాద్ సినిమా రిలీజైన కొద్దిరోజుల త‌రువాత త‌న నిర్ణ‌యం క‌రెక్టేనంటూ వ‌ర్మ చెప్పార‌ని పాత సంగ‌తుల‌ను గుర్తు చేశారు ప‌వ‌న్‌.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News