పవన్ మళ్ళీ చేతులు కాల్చుకుంటాడా ?

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్. క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే వంద‌కు వంద శాతం మాస్ మ‌సాలా ఉన్న చిత్రం. ఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్ ను ఎలా చూడాల‌నుకుంటారో.. వంద‌శాతం ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ అ విధంగా పవన్ చూపించి మెప్పించాడు. అందుకే బాక్సాఫీస్ లెక్కలను గబ్బర్ సింగ్ కలెక్షన్స్ అప్పట్లో తిరగరాసింది. ఇక దాని క్రేజ్ ను మరోసారి క్యాష్ చేసుకొనే పనిలో భాగంగా పవన్ కొత్తగ‌ […]

Advertisement
Update: 2016-04-11 05:01 GMT

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్. క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే వంద‌కు వంద శాతం మాస్ మ‌సాలా ఉన్న చిత్రం. ఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్ ను ఎలా చూడాల‌నుకుంటారో.. వంద‌శాతం ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ అ విధంగా పవన్ చూపించి మెప్పించాడు. అందుకే బాక్సాఫీస్ లెక్కలను గబ్బర్ సింగ్ కలెక్షన్స్ అప్పట్లో తిరగరాసింది. ఇక దాని క్రేజ్ ను మరోసారి క్యాష్ చేసుకొనే పనిలో భాగంగా పవన్ కొత్తగ‌ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చేశాడు. అయితే పవన్ కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా భారీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. క‌థ‌, క‌థ‌నాలు పూర్తిగా ప‌వన్ అందిచటం ఈసినిమాకి కొసమెరుపు.

ఇదిలావుంటే.. ఈ సినిమాకు వంద‌కు వంద శాతం సీక్వెల్ చేయ‌డం ఖాయం అని ఇటీవల‌ పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపాడు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌ల సంద‌ర్భంగా ఒక ప్ర‌ముఖ తెలుగు పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకు సీక్వెల్ చేసి తీరుతానని.. అయితే డైరెక్ట‌ర్.. ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు అనేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేను అంటూ క్లారీటి ఇచ్చారు. అయితే పవన్ ఆశిస్తున్నట్టు నిజంగా సీక్వెల్ చేయటానికి దర్శకుడు, ప్రొడ్యూసర్ లు ముందుకు వస్తే… కధలో ఇన్వాల్వ్ అవుకుండా ఉంటాడా లేక ఇన్వాల్వ అయ్యి మళ్ళీ చేతులు కాల్చుకుంటాడా లేక తానే అంతా అయ్యి భారీహిట్ సాధించి తన సత్తా ఏంటో మరోసారి తెలుగు ప్రజలకు కొత్తగా రుచి చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News