కొంప తగలడుతుంటే సిగరెట్ వెలిగించుకుంటున్న పవన్

ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే కాసేపు ఆగు సిగరెట్ వెలిగించుకుంటా అన్నాడట ఒకడు. పవన్‌ తీరు కూడా అలాగే ఉంది. ఆదివారం కొన్ని టీవీ చానళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పవన్ చెప్పిన విషయాలు వింటే కంపరం కలగకమానదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రమాదం కదా అన్న అభిప్రాయం కలగకమానదు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి ప్రజల తరపున ప్రశ్నిస్తా అంటూ పొలికేకలు వేసిన పవన్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. పవన్‌ […]

Advertisement
Update: 2016-04-11 10:50 GMT

ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే కాసేపు ఆగు సిగరెట్ వెలిగించుకుంటా అన్నాడట ఒకడు. పవన్‌ తీరు కూడా అలాగే ఉంది. ఆదివారం కొన్ని టీవీ చానళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పవన్ చెప్పిన విషయాలు వింటే కంపరం కలగకమానదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రమాదం కదా అన్న అభిప్రాయం కలగకమానదు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి ప్రజల తరపున ప్రశ్నిస్తా అంటూ పొలికేకలు వేసిన పవన్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. పవన్‌ ఎక్కడ అని మీడియా మరీ ఎక్కువగా ప్రశ్నిస్తే అలా వచ్చి ఒక ప్రెస్‌మీట్ పెట్టి తప్పించుకోవడం కామనైపోయింది.

తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు కూడా ప్రశ్నిస్తా అంటూ పాత పాటే పాడారు. ప్రత్యేక హోదా అంశం గుర్తుందని చెప్పారు. అయితే దానిపై పోరాడేందుకు సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని సెలవిచ్చారు. పవన్ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయింది. రెండేళ్లు గడిచిన తర్వాత కూడా సమయం కోసం ఎదురుచూస్తున్నానని పవన్ చెబుతున్నారంటే ఆయన చిత్తశుద్దిలో రాజకీయం చొరబడినట్టుగా ఉంది. అంటే ఎన్నికలు మరో ఆరు నెలలుండగా స్టేజ్‌ మీదకు ఎక్కి గావుకేకలు వేసి జనాన్ని మరోసారి పిచ్చొళ్లను చేసి ఓటు వేయించుకోవచ్చన్నది పవన్ భావనగా ఉంది.

ఏపీ దిక్కుదిమాన లేకుండా అల్లాడుతుంటే ఇంకా సమయం కావాలి అంటున్నారంటే మనిషి బతికున్నప్పుడు వైద్యం చేయించాల్సిందిపోయి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఘనంగా చేద్దామన్నట్టుగా ఉంది. పైగా తాను చాలాసార్లు ప్రశ్నించానుగా అని అంటున్నారు. కానీ పవన్ ప్రశ్నించింది కేవలం రెండు విషయాలపైనే. ఒకటి రాజధాని భూములు, రెండు తుని ఘటన తర్వాత ఒక ప్రెస్ మీట్. అంటే రెండేళ్లలో ఏపీలో పవన్‌కు కనిపించినవి ఈ రెండు సమస్యలేనా?. రైతు, డ్వాక్రా రుణమాఫీ మోసం పవన్‌కు కనిపించలేదా?.పవన్‌ను నమ్మి టీడీపీకి ఓటేసిన వారిలో రైతులు, మహిళలు కూడా ఉన్నారు కదా?. విద్యార్థిని రిషితేశ్వరి కులపోకడల దెబ్బకు నాగార్జున వర్శిటీలో ఆత్మహత్య చేసుకుంటే సమాజం మొత్తం స్పందించినా పవన్ ఎందుకు స్పందించలేదు?.

తమ మిత్రుడైన చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనేస్తుంటే ఇది తప్పు అని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య పరిరక్షకుడు పవన్‌కు ఇంతకాలం ఎందుకు గుర్తుకురాలేదు. ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి ప్రశ్నించే వరకూ ఇలా చేయడం తప్పు అని ఎందుకు నోరు విప్పలేదు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో వందలాది మంది పేద మహిళల శీలాలు నాశనమైపోతే పవన్‌కు ఆ విషయం తెలియదా?. ఇలా ముఖ్యమైన అంశాలపై రెండేళ్లుగా స్పందించకుండా కూర్చున్న పవన్‌ .. ఇప్పుడు 2019కి వస్తా అంటున్నారు. అంటే మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో ఏం జరిగినా పవన్‌ ప్రశ్నించరన్న మాట. తీరా ఎన్నికల సమయంలో వచ్చి జనాన్ని తికమకపెట్టి ఫలితాలను తారుమారు చేయడమే పవన్ పని కాబోలు. ఈసారి ఏ పార్టీతో ప్యాకేజీ మాట్లాడుకుని ఏ పార్టీకి మద్దతు ఇచ్చి జనాన్ని మరోసారి ముంచుతారో? అని జనం అనుకుంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News