బాలకృష్ణకు శ్రీకాంత్ రెడ్డి సూచన

సినిమాల్లో రాయలసీమ సంస్కృతిని, యాసను కించపరచడంపై బుధవారం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటకు ముందు రాయలసీమ గూండాలు అంటూ తమ ప్రాంతాన్ని కించపరుస్తున్నారని సినిమా వాళ్లపై మండిపడ్డారు. ఇకపై సినిమాల్లో రాయలసీమను కించపరిస్తే నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు కూడా పదేపదే రాయలసీమ గూండాలు అంటూ కించపరచడం మానుకోవాలని సూచించారు. సభ వాయిదా పడిన అనంతరం కూడా లాబీల్లో హీరో , హిందూపురం […]

Advertisement
Update: 2016-03-31 01:22 GMT

సినిమాల్లో రాయలసీమ సంస్కృతిని, యాసను కించపరచడంపై బుధవారం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటకు ముందు రాయలసీమ గూండాలు అంటూ తమ ప్రాంతాన్ని కించపరుస్తున్నారని సినిమా వాళ్లపై మండిపడ్డారు. ఇకపై సినిమాల్లో రాయలసీమను కించపరిస్తే నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేతలు కూడా పదేపదే రాయలసీమ గూండాలు అంటూ కించపరచడం మానుకోవాలని సూచించారు. సభ వాయిదా పడిన అనంతరం కూడా లాబీల్లో హీరో , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను శ్రీకాంత్ రెడ్డి కలిశారు. సినిమాల్లో రాయలసీమ సంస్కృతిని, యాసను కించపరచడం మానుకోవాలని కోరారు. రాయలసీమ నుంచే ఎన్నికైన ఎమ్మెల్యేగా ఇందుకు చొరవ తీసుకుని మరోసారి సీమ ప్రాంతాన్ని కించపరచకుండా చూడాలని కోరారు. విలన్లకు మాత్రమే రాయలసీమ యాస వాడి, హీరోలకు మాత్రం మరో యాస వాడడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇందుకు బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించారు. రాయలసీమ సంస్కృతి, యాసను సినిమాల్లో కించపరచకుండా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News