జగన్‌ పక్కన కూర్చోవద్దని ఆమె చెప్పినప్పుడు చాలా బాధపడ్డా...

ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ .. ఒక ఇంటర్వ్యూలో  ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. జగన్‌ విషయంలో కాంగ్రెస్‌ నేతల తీరు ఎలా ఉండేది వివరించారు.  వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పెద్దలు తనను నమ్మేవారు కాదన్నారు. జగన్‌ కాంగ్రెస్‌లోనే ఉండగా ఒక మీటింగ్‌ జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో  జగన్‌ పక్కన కూర్చోవద్దని… అలా చేస్తే సోనియాగాంధీకి కోపం వస్తుందని పనబాక లక్ష్మి తనతో చెప్పిందన్నారు. అప్పుడు తనకు […]

Advertisement
Update: 2016-03-27 20:01 GMT

ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ .. ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. జగన్‌ విషయంలో కాంగ్రెస్‌ నేతల తీరు ఎలా ఉండేది వివరించారు. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పెద్దలు తనను నమ్మేవారు కాదన్నారు. జగన్‌ కాంగ్రెస్‌లోనే ఉండగా ఒక మీటింగ్‌ జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో జగన్‌ పక్కన కూర్చోవద్దని… అలా చేస్తే సోనియాగాంధీకి కోపం వస్తుందని పనబాక లక్ష్మి తనతో చెప్పిందన్నారు. అప్పుడు తనకు చాలా బాధేసిందన్నారు. తన మిత్రుడి కుమారుడు, కాంగ్రెస్‌లోనే ఎంపీగా ఉన్న జగన్‌ పక్కన కూర్చోవద్దని చెప్పడాన్ని తాను తట్టుకోలేకపోయానన్నారు. పనబాక వ్యాఖ్యల తర్వాత కావాలనే వెళ్లి జగన్‌ పక్కన కూర్చున్నానని చెప్పారు. కొందరు నేతలు పనికట్టుకుని జగన్‌ దుర్మార్గుడు అని హైకమాండ్ దగ్గర కలరింగ్ ఇచ్చారని సాయిప్రతాప్ చెప్పారు. అలాంటి చెంచాలతోనే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

వైఎస్‌ అంటే గిట్టని నేతలంతా ఆయన చనిపోయిన తర్వాత తన గురించి కూడా నెగిటివ్‌గా సోనియాతో చెప్పారన్నారు. వీడు ఎప్పటికైనా వైఎస్‌ మనిషే అని సోనియాకు నూరిపోశారన్నారు. జీవితాంతం వైఎస్ కుటుంబంతో ఉండిపోవాలనుకున్నానని చెప్పారు. వైసీపీలో చేరేందుకు అనేకసార్లు తానే వర్తమానం పంపానన్నారు. జగన్‌కు తోడుగా తన అల్లుడు లోకేష్ ను పంపేందుకు సిద్ధపడ్డానని అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. వైఎస్‌తో ఆఖరి వరకు ఎలాంటి విబేధాలు లేకుండా స్నేహం చేసిన తనను జగన్‌ ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదన్నారు. జగన్‌ తనను ఎందుకు దూరం పెట్టాడా అన్న బాధ ఇప్పటికీ గుండెల్లో ఉందన్నారు. అయితే జగన్ ను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టినప్పుడు, ఆయన పార్టీపెట్టి బయటకు వ చ్చినప్పుడు కూడా సాయిప్రతాప్ కాంగ్రెస్ లోనే కొనసాగారు. అప్పుడు జగన్ వెంట రాలేదు.

జగన్, వైఎస్‌ మధ్య ఘర్షణ వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. తండ్రి కొడుకు చాలా అప్యాయంగానే ఉండేవారన్నారు. కడప ఎంపీ ఉప ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారని ఒక విలేకరి ప్రశ్నించగా… మంచివాళ్లు గెలుస్తారని చెప్పానని ఆ విషయాన్ని తీసుకెళ్లి సోనియా దగ్గర కొందరు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని సాయిప్రతాప్ చెప్పారు. ఆ ఎన్నికల్లో జగన్ గెలవగానే తన మంత్రి పదవి కూడా తీసేశారని చెప్పారు. శత్రువు వచ్చినా సాయం చేసే గుణం వైఎస్‌లో ఉండేదన్నారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు వైఎస్‌ ప్రత్యర్థుల కుటుంబాలు ఒక దశలో చాలా ఇబ్బంది పడ్డారని .. వారి పరిస్థితి చూసి చలించిపోయిన వైఎస్‌ వారికి ‘’నేనున్నా కదా’’ అంటూ సాయం చేశారని సాయిప్రతాప్ చెప్పారు. వైఎస్‌ చాలా గొప్పవ్యక్తి అన్నారు. తన అల్లుడు లోకేష్ ను ఎంపీగా చూడాలన్నదే తన ఆశ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News