సీఎం, స్పీకర్‌పై క్రిమినల్ చర్యలకు పిల్

రోజా సస్పెన్షన్ వ్యవహారం చివరకు కోర్టులు, చట్టసభల మధ్య పోరాటంగా మారుతోంది. రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ఈ పిల్ దాఖలు చేశారు. వెంటనే సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు.  తనకు రాజకీయాలతో సంబంధం లేదని అయితే సీఎం, స్పీకర్ తీరు వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని గోపాలకృష్ణ ఆందోళన […]

Advertisement
Update: 2016-03-21 00:03 GMT

రోజా సస్పెన్షన్ వ్యవహారం చివరకు కోర్టులు, చట్టసభల మధ్య పోరాటంగా మారుతోంది. రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ఈ పిల్ దాఖలు చేశారు.

వెంటనే సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని అయితే సీఎం, స్పీకర్ తీరు వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని గోపాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రోజా విషయంలో ప్రభుత్వ తీరు వల్ల కోర్టులపై ప్రజల్లో గంటగంటకు గౌరవం దిగజారిపోతోందన్నారు. కోర్టులను ధిక్కరించినా ఏమీ కాదన్న భావన ప్రజల్లో బలపడుతోందని ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు.

రాజ్యంగ విరుద్ధంగా అసెంబ్లీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయని గతంలో సుప్రీం కోర్టు జడ్జి చలమేశ్వర్ స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. తమిళనాడులో ఇలాగే ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వారి అలవెన్స్‌లు కూడా నిలివేయడాన్ని చలమేశ్వర్ బెంచ్‌ తప్పుపట్టిందని గుర్తు చేశారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఏపీ అసెంబ్లీ స్పీకర్, సీఎంలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ఆరోపించారు. స్పీకర్‌ చర్య హేయమైనదిగా ఆయన అభివర్ణించారు. కోర్టుల గౌరవం కాపాడేందుకు వెంటనే స్పీకర్, సీఎంలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తాను పిల్‌ లో కోరినట్టు ఆయన చెప్పారు. ఈ పిల్ పై విచారణ మంగళవారం జరగనుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News