రోజా కులాన్ని పదేపదే ఎత్తిచూపేందుకు బోండా పరోక్ష ప్రయత్నం !

ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల సంఘం సమర్పించిన నివేదికపై చర్చ జరిగింది.  ప్రతిపక్షం లేకుండానే అధికారపక్షమే చర్చ జరుపుకుంది.  చర్చలో పాల్గొన్న బోండా ఉమా … రోజాపై తీవ్ర విమర్శలు చేశారు.  రోజా తీరుతో సభ్యసమాజం నివ్వెరపోయిందన్నారు.  ఇలాంటి మహిళలు కూడా ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయారన్నారు.  ఆమె మాట్లాడిన భాషను ఉచ్చరించాలన్నా తనకు ఇబ్బందిగా ఉందన్నారు.  అలాంటి మాటలు మాట్లాడేందుకు వైసీపీ సభ్యులకు నోరెలా వచ్చిందని సాధు జంతువులా ప్రశ్నించారు.  దేవాలయం లాంటి సభలో ఇలాంటి […]

Advertisement
Update: 2016-03-21 03:52 GMT

ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల సంఘం సమర్పించిన నివేదికపై చర్చ జరిగింది. ప్రతిపక్షం లేకుండానే అధికారపక్షమే చర్చ జరుపుకుంది. చర్చలో పాల్గొన్న బోండా ఉమా … రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. రోజా తీరుతో సభ్యసమాజం నివ్వెరపోయిందన్నారు. ఇలాంటి మహిళలు కూడా ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయారన్నారు. ఆమె మాట్లాడిన భాషను ఉచ్చరించాలన్నా తనకు ఇబ్బందిగా ఉందన్నారు. అలాంటి మాటలు మాట్లాడేందుకు వైసీపీ సభ్యులకు నోరెలా వచ్చిందని సాధు జంతువులా ప్రశ్నించారు. దేవాలయం లాంటి సభలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారని అన్నారు. శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని ఉమా మరోసారి స్పష్టం చేశారు. సీనియర్ అయినప్పటికీ జ్యోతుల నెహ్రూ కూడా సభ గౌరవాన్ని మంటకలిపారన్నారు. జగన్ సభకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్లు ఏ జాతికి చెందిన వారో అర్థం కావడం లేదన్నారు.

మరోవైపు బోండా ఉమా తన ప్రసంగంలో పరోక్షంగా రోజా కులాన్ని పదేపదే ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. రోజాను సంభోదించాల్సి వచ్చిన ప్రతిసారి రోజా రెడ్డి రోజారెడ్డి అంటూ ఉచ్చరించారు. ప్రతిసారి కూడా రోజా పేరు చివర రెడ్డి పేరు ఉండేలా బోండా ఉమా ప్రయత్నించారు. పరోక్షంగా రోజా … రెడ్డి కులానికి చెందిన వారని ఎత్తిచూపే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. అగ్రకులానికి చెందిన మహిళ… ఒక దళిత మహిళను కించపరిచారన్న సంకేతాలు పంపేందుకు బోండా ఉమా ఇలా కులాన్ని పదేపదే ఎత్తిచూపి ఉంటారని భావిస్తున్నారు. గతంలోనూ రోజాపై ఎస్సీలను ఉసిగొల్పే ప్రయత్నం చేసిన ప్రతిసారి రోజాను రోజారెడ్డి అని టీడీపీ నేతలు సంబోధించడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. బొండా ఉమా ఓ పాతిక సార్లు రోజాను రోజారెడ్డి అని సంబోధించారు. సెక్స్ రాకెట్ సీఎం, కాల్ మనీ సీఎం అంటూ గతంలో సభలో వైసీపీ సభ్యులు చేసిన నినాదాలను ఉమ గుర్తు చేశారు. అచ్చెన్నాయుడుని కొడాలి నాని ” దున్నపోతులా పెరిగాడు, కుక్కలాగా మొరుగుతాడు, సొళ్లుగాడు, ఎద్దులా పెరిగాడు, వాడికి బుద్దిలేదు, వాళ్ల ముఖ్యమంత్రి సెక్స్ సెక్స్ అంటూ మాట్లాడుతున్నాడంటూ” నాని చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News