ముఖ్యమంత్రిని మెచ్చుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి!

రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉండగా సమర్ధవంతంగా మూడేళ్లపాటు బండిలాగించిన నేత కిరణ్‌కుమార్ రెడ్డి.  ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కూడా ఆయనే. రాష్ట్ర విభజన జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన అప్పట్లో పదేపదే హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల్లో కొన్నింటిని ఆయన వెనక్కు తీసుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా తనకు సన్నిహితంగా ఉండడంతో పాటు జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసి అనంతరం టీడీపీలో చేరిన ఒక నేత కిరణ్‌కుమార్ రెడ్డిని ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా […]

Advertisement
Update: 2016-03-19 23:09 GMT

రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉండగా సమర్ధవంతంగా మూడేళ్లపాటు బండిలాగించిన నేత కిరణ్‌కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కూడా ఆయనే. రాష్ట్ర విభజన జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన అప్పట్లో పదేపదే హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల్లో కొన్నింటిని ఆయన వెనక్కు తీసుకుంటున్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉండగా తనకు సన్నిహితంగా ఉండడంతో పాటు జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసి అనంతరం టీడీపీలో చేరిన ఒక నేత కిరణ్‌కుమార్ రెడ్డిని ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పరిపాలనపై ఆయన తన అభిప్రాయాలను చెప్పారట. ముందుగా కేసీఆర్‌ పనితీరును కిరణ్‌కుమార్ రెడ్డి మొచ్చుకున్నారని సదరు నేత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య వస్తుందని తాను భావించానని అయితే అలాంటి సమస్య లేకుండా కేసీఆర్ సమర్ధవంతంగా పాలిస్తున్నారని కిరణ్‌ చెప్పారట.

దేశంలో చాలా రాష్ట్రాల్లో పదేపదే శాంతిభద్రతల సమస్య తలెత్తుతున్నా…. హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదని ఇందుకు కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసులను మెచ్చుకోవాలన్నారు. ఇటీవల కేసులో ఇరుకున్న ఏపీ మంత్రి కుమారుడి విషయంలోనూ టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కిరణ్‌ ప్రశంసించారని సదరు నేత మీడియాకు వివరించారు. ఏపీ ప్రభుత్వ పనితీరుపై మాత్రం కిరణ్‌కుమార్‌ రెడ్డి సానుకూలంగా స్పందించలేదట.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News