జగన్‌ మీద ట్వీట్ చేసిన లోకేష్ … స్పీకర్‌పై ఎందుకు చేయలేదబ్బా!

తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టులు క్లీన్‌ చిట్ ఇచ్చాయంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కోర్టు తీర్పులను చదివారు. ఈసందర్భంగా జోక్యం చేసుకున్న జగన్ … వ్యవస్థలను మేనేజ్ చేసి కేసుల నుంచి చంద్రబాబు బయటపడ్డారని విమర్శించారు. అంతే అధికార పార్టీ ఒక్కసారిగా జగన్‌పై దాడికి దిగింది.  జగన్‌ కోర్టును కించపరిచారంటూ వాదించారు. ప్రలోభాలకు లొంగి కోర్టులు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు చెప్పాయన్నట్టుగా జగన్‌ మాట్లాడారంటూ మంత్రులంతా మూకుమ్మడిగా దాడికి దిగారు.  వెంటనే కోర్టులకు క్షమాపణ చెప్పాలని […]

Advertisement
Update: 2016-03-18 01:08 GMT

తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టులు క్లీన్‌ చిట్ ఇచ్చాయంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కోర్టు తీర్పులను చదివారు. ఈసందర్భంగా జోక్యం చేసుకున్న జగన్ … వ్యవస్థలను మేనేజ్ చేసి కేసుల నుంచి చంద్రబాబు బయటపడ్డారని విమర్శించారు. అంతే అధికార పార్టీ ఒక్కసారిగా జగన్‌పై దాడికి దిగింది. జగన్‌ కోర్టును కించపరిచారంటూ వాదించారు.

ప్రలోభాలకు లొంగి కోర్టులు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు చెప్పాయన్నట్టుగా జగన్‌ మాట్లాడారంటూ మంత్రులంతా మూకుమ్మడిగా దాడికి దిగారు. వెంటనే కోర్టులకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో జగన్‌పై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంలో వాదించారు. ఆ సమయంలో చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ట్వీట్టర్‌లో స్పందించారు. జగన్‌కు న్యాయస్థానాలన్నా, స్పీకర్‌, మీడియా అన్నా గౌరవం లేకుండా పోయిందని ట్వీట్‌లో ఫైర్ అయ్యారు లోకేష్. అక్కడితో కట్ చేస్తే…

ఇప్పుడు న్యాయస్థానాలపై టీడీపీ నేతలకు ఎంత ప్రేమ ఉందో అర్ధమయ్యే సన్నివేశం రోజా రూపంలో వచ్చింది. రోజాపై సస్పెన్షన్‌ను హైకోర్టే కొట్టివేసింది. రోజాను సభలోకి అనుమతించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను అమలు చేసే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు లేదని మీడియా సాక్షిగానే చెబుతున్నారు.

జగన్‌ విషయంలో కోర్టులంటే గౌరవం లేదా వెంటనే క్షమాపణ చెప్పూ అంటూ గర్జించిన టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు. కోర్టులను ఒక్కశాతం కూడా లెక్కచేయడం లేదు. జగన్‌కు కోర్టులపై గౌరవం లేదని ట్వీట్లు పెట్టిన లోకేష్ కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. అంటే టీడీపీ నేతలు ఏం చేసినా కరెక్టే అన్నది ఆయన భావన కాబోలు. లేకుంటే న్యాయస్థానాలు కూడా తమ ప్రభుత్వానికి లోబడే పనిచేయాలన్నది తమ్ముళ్ల ఫీలింగ్ కాబోలు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News