పెళ్లి కాదన్నందుకు...కాల్చేశారు...ఫేస్బుక్లో పోస్టు చేశారు!
పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదన్నదన్న కోపంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే కాల్చి చంపేశారు. జర్మనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 21ఏళ్ల ఆ యువతికి ఆమెకు కజిన్ వరసయ్యే వ్యక్తిని ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ పెళ్లి ఇష్టంలేని పెళ్లి కూతురు పెళ్లి మండపంలో మరోసారి తన వ్యతిరేకత వ్యక్తం చేసింది. తానీ పెళ్లి చేసుకోలేనని చెప్పింది. అంతే… పెళ్లికి వచ్చిన ఆహుతులు చూస్తుండగానే ఆమె సన్నిహిత బంధువే […]
పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదన్నదన్న కోపంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే కాల్చి చంపేశారు. జర్మనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 21ఏళ్ల ఆ యువతికి ఆమెకు కజిన్ వరసయ్యే వ్యక్తిని ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ పెళ్లి ఇష్టంలేని పెళ్లి కూతురు పెళ్లి మండపంలో మరోసారి తన వ్యతిరేకత వ్యక్తం చేసింది. తానీ పెళ్లి చేసుకోలేనని చెప్పింది. అంతే… పెళ్లికి వచ్చిన ఆహుతులు చూస్తుండగానే ఆమె సన్నిహిత బంధువే కాల్చి చంపేశాడు. అంతేకాదు, రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని నిశ్చేష్టులై చూస్తున్నఅతిథులను కలిపి ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు ఆమె కన్న తండ్రి. తన కూతురు ఇంజినీరని, కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లిని కాదన్నందుకు ఆమెపై పగతీర్చుకున్నామని, ఇది హత్యకాదని, సాంప్రదాయాన్నికాపాడుకోవడానికే ఇలా చేశామని కామెంట్ కూడా పెట్టాడు. జర్మనీలో సంచలనం సృష్టించిన ఈ హత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జర్మనీలో అమ్మాయిలు ఇష్టంలేకపోయినా పెద్దలు కుదిర్చిన వివాహాలను భయంతో చేసుకుంటున్నారని, వేల సంఖ్యలో అమ్మాయిలు ఈ విషయంమీద కౌన్సెలింగ్‌కి వెళుతున్నారని సమాచారం.