తెలుగు యాంక‌ర్ నిరోషా ఆత్మ‌హ‌త్య‌!

యాంకర్‌ నిరోషా ఆత్మహత్మ చేసుకుంది. ఒక తెలుగు మ్యూజిక్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న నిరోషా గత రాత్రి సికింద్రాబాద్‌ సింధి కాలనీలోని ఒక వర్కింగ్‌ ఉమెన్స్ హాస్టల్‌లో ఆత్మహత్యచేసుకుంది. ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. నిరోషాకు కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. గత రాత్రి కాబోయే భర్తతో నిరోషా వీడియోకాల్‌లో మాట్లాడింది. అనంతరం గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. నిరోషా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు […]

Advertisement
Update: 2016-03-15 23:02 GMT

యాంకర్‌ నిరోషా ఆత్మహత్మ చేసుకుంది. ఒక తెలుగు మ్యూజిక్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న నిరోషా గత రాత్రి సికింద్రాబాద్‌ సింధి కాలనీలోని ఒక వర్కింగ్‌ ఉమెన్స్ హాస్టల్‌లో ఆత్మహత్యచేసుకుంది. ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. నిరోషాకు కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. గత రాత్రి కాబోయే భర్తతో నిరోషా వీడియోకాల్‌లో మాట్లాడింది. అనంతరం గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. నిరోషా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిరోషా ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎవరెవరితో మాట్లాడింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. కాబోయే భర్తను విచారిస్తున్నారు. నిరోషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్‌ ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News