రబ్రీదేవి వల్లే ఆర్‌ఎస్‌ఎస్‌ డ్రెస్‌ మారిందా?

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి వల్లే ఆర్‌ఎస్‌ఎస్‌ డ్రెస్‌కోడ్‌ మారిందని లాలూ ట్వీట్‌ చేశారు. 1925లో ఆర్‌ఎస్ఎస్‌ ఏర్పడినప్పటినుంచి చొక్కా రంగు రెండుసార్లు మారినా చెడ్డీమాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు ఖాకీదే వాడుతున్నారు. అయితే గత ఆదివారం సమావేశమైన అఖిలభారత ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధిసభ వార్షికోత్సవ సమావేశాల్లో డ్రెస్‌కోడ్‌ మార్చాలని, ఖాకీ నిక్కర్‌ స్థానంలో గోధుమ రంగు ప్యాంట్‌ ధరించాలని నిర్ణయించారు. ఈ మార్పుకు కారణం తన భార్య రబ్రీదేవి అని లాలూ ప్రసాద్‌ […]

Advertisement
Update: 2016-03-15 02:12 GMT

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి వల్లే ఆర్‌ఎస్‌ఎస్‌ డ్రెస్‌కోడ్‌ మారిందని లాలూ ట్వీట్‌ చేశారు. 1925లో ఆర్‌ఎస్ఎస్‌ ఏర్పడినప్పటినుంచి చొక్కా రంగు రెండుసార్లు మారినా చెడ్డీమాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు ఖాకీదే వాడుతున్నారు. అయితే గత ఆదివారం సమావేశమైన అఖిలభారత ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధిసభ వార్షికోత్సవ సమావేశాల్లో డ్రెస్‌కోడ్‌ మార్చాలని, ఖాకీ నిక్కర్‌ స్థానంలో గోధుమ రంగు ప్యాంట్‌ ధరించాలని నిర్ణయించారు.

ఈ మార్పుకు కారణం తన భార్య రబ్రీదేవి అని లాలూ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. “పబ్లిక్‌లో చెడ్డీలు వేసుకుని తిరగడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వృద్ధులకు సిగ్గు అనిపించడంలేదా?” అని రబ్రీదేవి రెండునెలల క్రితం ప్రశ్నించారని, అందువల్లే ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు చెడ్డీలనుంచి ప్యాంట్‌లకు మారిపోతున్నారని, ఇది మాఆవిడ ఎఫెక్టేనని లాలూ ఉవాచ!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News