బీజేపీ అధ్యక్ష పదవికి టీడీపీ అభ్యర్ధి

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్ష పదవికోసం బీజేపీలో నాయకుల కన్నా టీడీపీ నాయకులు ఎక్కువగా చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం ఎపీ బీజేపీ అధ్యక్షులుగా హరిబాబు వున్నారు. ఈసారికూడా హరిబాబే అధ్యక్షుడు కావాలని టీడీపీ కోరుకుంటోంది. తమ సామాజిక వర్గం వాళ్లు ఏ పార్టీలో వున్నా టీడీపీ కోసమే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని వాళ్ల నమ్మకం. కేంద్రంలో వెంకయ్యనాయుడు బీజేపీ మంత్రి అయినా ఆయన అహర్నిశలు టీడీపీ మేలుకోసం తాపత్రయపడుతుంటాడు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని […]

Advertisement
Update: 2016-03-12 03:31 GMT

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్ష పదవికోసం బీజేపీలో నాయకుల కన్నా టీడీపీ నాయకులు ఎక్కువగా చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం ఎపీ బీజేపీ అధ్యక్షులుగా హరిబాబు వున్నారు. ఈసారికూడా హరిబాబే అధ్యక్షుడు కావాలని టీడీపీ కోరుకుంటోంది. తమ సామాజిక వర్గం వాళ్లు ఏ పార్టీలో వున్నా టీడీపీ కోసమే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని వాళ్ల నమ్మకం. కేంద్రంలో వెంకయ్యనాయుడు బీజేపీ మంత్రి అయినా ఆయన అహర్నిశలు టీడీపీ మేలుకోసం తాపత్రయపడుతుంటాడు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులందరికీ బీజేపీ శ్రేయస్సుకన్నా చంద్రబాబు శ్రేయస్సు ముఖ్యం. జాగ్రత్తగా గమనిస్తే వాళ్లు బీజేపీ పార్టీనో తెలుగుదేశం పార్టీనో అర్ధంకానంతగా మమేకమైపోయి వుంటారు.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించనుంది. ఈ పదవికోసం కాపు సామాజిక వర్గానికి చెందిన సోమువీర్రాజు గట్టిగా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కులరాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కమ్మ సామాజిక వర్గానికి అధ్యక్షపదవి ఇవ్వవద్దని బీజేపీకి సలహా యిచ్చింది. ఎలాగైనా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలని వెంకయ్యనాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సోమువీర్రాజు పార్టీ పగ్గాలు చేపడితే ఆయన బీజేపీ, టీడీపీల మధ్య పొత్తును గట్టిగా వ్యతిరేకించవచ్చు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కన్విన్స్‌ చేశాడని చెబుతున్నారు.ఆయన కాస్త ధైర్యం చేసి వెంకయ్యనాయుడికి వ్యతిరేకంగా పార్టీలో ప్రచారం చేస్తున్నారు.

మొన్న రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా కూడా ఆయన చాలా సాహసించి సభా ప్రాంగణంలో వెంకయ్యనాయుడు ఫ్లెక్సీలను కూడా లేకుండా చూశారు. టీడీపీతో పొత్తు వద్దని ఫ్లెక్సీలు పెట్టారు. అమిత్‌షా సభ జరుగుతున్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అధికార పదవులు అనుభవిస్తున్న కొద్దిమంది బీజేపీ నాయకులు తప్ప సామాన్య బీజేపీ కార్యకర్తలు ఎక్కువమంది టీడీపీతో పొత్తువద్దని కోరుకుంటున్నారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వద్దని వారు అమిత్‌షాను కోరినట్టు తెలిసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News