బరితెగిస్తున్న జర్నలిస్టులు

ఒకప్పుడు జర్నలిస్టులకు చాలా గౌరవం. మేధావులన్న పేరు. సమాజంకోసం త్యాగాలు చేస్తారన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. జర్నలిస్టుల పోకడలు మారాయి. నీతివంతులైన, బాగా చదువుకున్న కొద్దిమంది జర్నలిస్టులను మినహాయిస్తే ఎక్కువమంది జర్నలిస్టులలో సమాజంలోని అవలక్షణాలన్నీ దర్శనమిస్తున్నాయి. మీడియా సంస్థలు ఉన్నత విలువలుకలిగిన, సమాజ శ్రేయస్సును కాంక్షించే వ్యక్తుల దగ్గరనుంచి వ్యాపారసంస్థల చేతుల్లోకి, రాజకీయ పార్టీల చేతుల్లోకి, పొలిటికల్‌ బ్రోకర్ల చేతుల్లోకి క్రమంగా మారిపోతున్నాయి. జర్నలిస్టులు కూడా నిస్సిగ్గుగా, బరితెగించి ఆయా రాజకీయ పార్టీల […]

Advertisement
Update: 2016-03-11 22:06 GMT

ఒకప్పుడు జర్నలిస్టులకు చాలా గౌరవం. మేధావులన్న పేరు. సమాజంకోసం త్యాగాలు చేస్తారన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. జర్నలిస్టుల పోకడలు మారాయి. నీతివంతులైన, బాగా చదువుకున్న కొద్దిమంది జర్నలిస్టులను మినహాయిస్తే ఎక్కువమంది జర్నలిస్టులలో సమాజంలోని అవలక్షణాలన్నీ దర్శనమిస్తున్నాయి.
మీడియా సంస్థలు ఉన్నత విలువలుకలిగిన, సమాజ శ్రేయస్సును కాంక్షించే వ్యక్తుల దగ్గరనుంచి వ్యాపారసంస్థల చేతుల్లోకి, రాజకీయ పార్టీల చేతుల్లోకి, పొలిటికల్‌ బ్రోకర్ల చేతుల్లోకి క్రమంగా మారిపోతున్నాయి.
జర్నలిస్టులు కూడా నిస్సిగ్గుగా, బరితెగించి ఆయా రాజకీయ పార్టీల కొమ్ముకాయడం దశనుంచి తమకు నచ్చనివాళ్లమీద, నోటికి అడ్డూ ఆపు లేకుండా తిట్లవర్షం కురిపించడం, బూతులు మాట్లాడడం వరకు వెళ్లిపోతున్నారు.

జేఎన్‌యూ వివాదం తరువాత జీ న్యూస్‌కు చెందిన రోహిత్‌ సర్ధానా, సుధీర్‌ చౌదరి, టైమ్స్‌నౌకి చెందిన అర్నబ్‌గోస్వామి లాంటి వాళ్లు పాత్రికేయ విలువలకు పాతరవేసిన విధానం చూస్తుంటే మన దేశంలో ఇక మీడియా హౌసులు ఎలా ఉండబోతున్నాయో తెలుస్తోంది.

జీ న్యూస్‌కు చెందిన రోహిత్‌ సర్ధానా, సుధీర్‌ చౌదరి… ఎన్డీటీవి ప్రతినిధి బర్ఖాదత్‌పై వ్యాఖ్యానిస్తూ “వేశ్యలకు గిరాకీ తగ్గినప్పుడు వాళ్లు కష్టమర్లను వెతుక్కునేందుకు రోడ్లమీదకు వచ్చినట్టుగా బర్ఖాదత్‌ జేఎన్‌యూకు వచ్చిందని కామెంట్‌ చేశారు. విశేషమేమిటంటే ఇదే జీ న్యూన్‌ ప్రతినిధులు జిందాల్‌ కంపెనీ వాళ్లను వందకోట్ల లంచం అడుగుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. కేసు కోర్టులో నడుస్తోంది. అలాంటి వ్యక్తిత్వం వున్న వీళ్లు జీ టీవిలో ఇతరుల గురించి చేసే కామెంట్స్‌ చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

అర్నబ్‌గోస్వామి టీవి వ్యాఖ్యాతకన్నా ఒక మానసిక రోగిలాగా కనిపిస్తాడు. స్ర్కీన్‌మీద అరుపులు, కేకలు, రంకెలతో ఎవరినీ మాట్లాడనివ్వడు. ప్రశ్నలు వేస్తాడు. ఎవ్వరినీ సమాధానం చెప్పనివ్వకుండా కంఠనాళాలు తెగిపోతాఏమో అన్నట్టుగా పెడబొబ్బలు పెడుతూ, రంకెలు వేస్తుంటాడు. ఇదేం జర్నలిజమో అర్ధంకాని పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి జర్నలిస్టులను చూడాల్సిన పరిస్థితి మన మీడియాకు, భారత ప్రజలకు దాపురిస్తుందో!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News