సరైనోడు సాంగ్ సూపర్ హిట్

అదేంటి… అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సరైనోడు సినిమా ఆడియో ఇంకా విడుదల కాలేదు కదా… అప్పుడే సూపర్ హిట్ అని ఎలా చెబుతున్నాం అనుకుంటున్నారా…. ఆడియో విడుదలైంది. అయితే నేరుగా కాదు… ఎవరో ఆకతాయి ఇంటర్నెట్ లో సరైనోడు సాంగ్ ను లీక్ చేశాడు. ఆ పాటే ఇప్పుడు సూపర్ హిట్ అయి కూర్చుంది. అవును…. తమన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సాంగ్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. బన్నీ-రకుల్ […]

Advertisement
Update: 2016-03-09 23:49 GMT

అదేంటి… అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సరైనోడు సినిమా ఆడియో ఇంకా విడుదల కాలేదు కదా… అప్పుడే సూపర్ హిట్ అని ఎలా చెబుతున్నాం అనుకుంటున్నారా…. ఆడియో విడుదలైంది. అయితే నేరుగా కాదు… ఎవరో ఆకతాయి ఇంటర్నెట్ లో సరైనోడు సాంగ్ ను లీక్ చేశాడు. ఆ పాటే ఇప్పుడు సూపర్ హిట్ అయి కూర్చుంది. అవును…. తమన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సాంగ్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. బన్నీ-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా…. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సరైనోడు సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చేద్దామనుకుంటున్న సినిమా యూనిట్ కు ఎవరో ఇలా ఝలక్ ఇచ్చాడు. కచ్చితంగా ఇది ఇంటిదొంగ పనే. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఆ ఇంటిదొంగను పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు నిర్మాత అల్లు అరవింద్.

Tags:    
Advertisement

Similar News