టీడీపీ ఎమ్మెల్యే పరోక్షంగా బాబుపైనే సెటైర్ వేశారా?

మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీచ్ ఆకట్టుకుంది. మహిళలు ఎంతో ఇష్టపడే పసుపు రంగును టీడీపీకి వాడుతున్నామని దాన్ని బట్టే మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. జగన్‌ సభను పక్కదారి పట్టించారని అన్నారు. ‘’అన్నా నీకు రోజా గురించే బాధగా ఉందా?. నాకు జరిగిన అన్యాయం గుర్తు లేదా?. తిరిగి అలాంటి రోజా గురించి ఇక్కడ మాట్లాడడం సరైనదేనా’’ అని ప్రశ్నించారు.  ఒక చెల్లిగా జగన్‌ను అడుగుతున్నానని తనకు న్యాయం చేయాలని కోరారు. […]

Advertisement
Update: 2016-03-08 02:15 GMT

మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీచ్ ఆకట్టుకుంది. మహిళలు ఎంతో ఇష్టపడే పసుపు రంగును టీడీపీకి వాడుతున్నామని దాన్ని బట్టే మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. జగన్‌ సభను పక్కదారి పట్టించారని అన్నారు. ‘’అన్నా నీకు రోజా గురించే బాధగా ఉందా?. నాకు జరిగిన అన్యాయం గుర్తు లేదా?. తిరిగి అలాంటి రోజా గురించి ఇక్కడ మాట్లాడడం సరైనదేనా’’ అని ప్రశ్నించారు. ఒక చెల్లిగా జగన్‌ను అడుగుతున్నానని తనకు న్యాయం చేయాలని కోరారు.

దేవుడు మహిళా పక్షపాతి అంటూ ఒక ఉదాహరణ చెప్పారు. మహిళల పక్షపాతి అయిన దేవుడు అందుకు తగ్గట్టుగానే ముఖ్యమైన శాఖలన్నీ మహిళలకే అప్పగించారని చెప్పారు. ఆర్థిక శాఖ లక్ష్మి దేవికి, విద్యా శాఖ సరస్వతికి, నీటిపారుదల శాఖ గంగాదేవికి, హోంశాఖ దుర్గాదేవికి అప్పగించడం ద్వారా మహిళల పట్ల దేవుడు తన గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు. అయితే దేవుడు ముఖ్యమైన శాఖలను మహిళా దేవతలకు అప్పగించిన మాట వాస్తవమే. అయితే మరి చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే..

అనిత చెబుతున్నట్టుగా ముఖ్యమైన శాఖలైన విద్యాశాఖ గానీ, నీటిపారుదల శాఖ గానీ, హోంశాఖ గానీ, ఆర్థిక శాఖ గానీ ఏ ఒక్క మహిళా మంత్రికి అప్పగించలేదు. అంటే దేవుడి తరహాలో చంద్రబాబు మహిళకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదనేగా అర్థం. మదర్‌ ధెరిస్సా మన దేశం వ్యక్తి కావడం గర్వకారణమని అనిత అన్నారు. అయితే మదర్ థెరిస్సా పుట్టింది మన దేశంలో కాదు. అయినప్పటికీ ఆమె చేసిన సేవలకు గుర్తుగా ఆ మహనీయురాలిని మన దేశస్తురాలిగా చెప్పుకున్నా తప్పుకాదనే చెప్పాలి.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News