నారాయణ… నారాయణ! ప్రమీలను కూడా దించేశారు

అమరావతిలో ల్యాండ్ మాఫియాలో అతిపెద్ద మనిషి మంత్రి నారాయణేనని సాక్షి పత్రిక కథనాలు తేలుపుతున్నాయి. తొలి నుంచి రాజధాని భూముల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నారాయణ పనిలోపనిగా వేల ఎకరాలు సొంతం చేసుకున్నారు. ఆయన దగ్గర పనిచేసే చిన్నచిన్న ఉద్యోగుల పేరుతో రాజధాని ప్రాంతంలో భారీగా భూములుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  నారాయణ మొత్తం మూడు వేల 129 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 432 కోట్లతో కొనుగోలు చేసిన భూముల విలువ ప్రస్తుతం రూ. 14 వేల కోట్లకు […]

Advertisement
Update: 2016-03-02 21:36 GMT

అమరావతిలో ల్యాండ్ మాఫియాలో అతిపెద్ద మనిషి మంత్రి నారాయణేనని సాక్షి పత్రిక కథనాలు తేలుపుతున్నాయి. తొలి నుంచి రాజధాని భూముల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నారాయణ పనిలోపనిగా వేల ఎకరాలు సొంతం చేసుకున్నారు. ఆయన దగ్గర పనిచేసే చిన్నచిన్న ఉద్యోగుల పేరుతో రాజధాని ప్రాంతంలో భారీగా భూములుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నారాయణ మొత్తం మూడు వేల 129 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 432 కోట్లతో కొనుగోలు చేసిన భూముల విలువ ప్రస్తుతం రూ. 14 వేల కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు.

మంత్రి నారాయణకు బినామీగా వ్యవహరించిన వారిలో కొందరు అంటూ ముగ్గురు పేర్లను కూడా ప్రచురించారు. ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల పేర్లతో భారీగా నారాయణ భూములు కొనుగోలు చేశారు. మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు పేరుతో తుళ్లూరు మండలం మందడంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అద్దె ఇంట్లో ఉండే మంత్రి నారాయణ దూరపు బంధువు మునిశంకర్‌ కూడా అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేశారు.

నారాయణ బినామీల జాబితాలో ప్రమీల అనే మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె పేరుతోనూ భారీగా భూములు కొన్నారని కథనం. ప్రమీల మంత్రి నారాయణకు సన్నిహితురాలని చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీల రాజధానిలో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఒక వ్యక్తి మూడు వేల ఎకరాలు కొనుగోలు చేశారంటే మనిషి ఆశకు హద్దు ఉండదన్న మాట నిజమేననిపిస్తోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News