జగన్‌ను రెండో పెళ్లి చేసుకోమన్నా… బాబుకు కులపిచ్చి వద్దన్నా…

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో  ప్రసంగించిన ఆయన అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పారు.  రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని…అయితే వారు ఇబ్బంది పెడితే అంతకు రెండింతలు ఇబ్బంది పెడుతానని హెచ్చరించారు. జగన్‌కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని వీరభోగవసంతరాయుడి లాంటి కొడుకును కనాల్సిందిగా తాను సూచించానన్నారు.  తాను మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రాజకీయాలు చేస్తున్నానని […]

Advertisement
Update: 2016-02-29 22:43 GMT

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఆయన అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పారు. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని…అయితే వారు ఇబ్బంది పెడితే అంతకు రెండింతలు ఇబ్బంది పెడుతానని హెచ్చరించారు.

జగన్‌కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని వీరభోగవసంతరాయుడి లాంటి కొడుకును కనాల్సిందిగా తాను సూచించానన్నారు. తాను మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. బద్వేల్‌లో జయరాములు( వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే) రాజకీయంగా వీక్‌గా ఉన్నారని అక్కడికి వెళ్లాల్సిందిగా తనకు సీఎం సూచించారన్నారు.

తనకు కులపిచ్చి లేదని… చంద్రబాబుకు కులపిచ్చి ఉంటే తాను మార్చుకోమని చెప్పానన్నారు. వైఎస్ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని.. అంతకంటే వేగంగా చేయాలని చంద్రబాబుకు సూచించానన్నారు. ఆదినారాయణరెడ్డి ప్రసంగం అంతా ఒక ఎత్తు అయితే జగన్‌ను రెండో పెళ్లి చేసుకోమని సూచించాననడం చర్చనీయాంశమైంది.

మగపిల్లాడి కోసం రెండో పెళ్లి చేసుకోమని సూచించడాన్ని బట్టి ఆయన ఆలోచన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. ఆ మధ్య చంద్రబాబు కూడా ఇలాగే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యానించారు. అప్పట్లో సీఎం వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు క్యాస్ట్‌ ఫీలింగ్‌ పైనా ఆది వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఆది కామెంట్స్‌ను టీడీపీ అనుకూలమైనదిగా పేరున్న పత్రిక ప్రచురించడం కొసమెరుపు.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News