జగన్‌ కోసమే పార్టీ మారా…

వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాను పార్టీ మారాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.  సోమవారం జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆదినారాయణరెడ్డి జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ ఆస్తులకు వడ్డీలు కట్టితే ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 6 లక్షల కోట్లని తేల్చారు.  అప్పట్లో జగన్‌ సంపాదించింది లక్ష కోట్లు అన్నారని దానికి రూపాయి వడ్డీ వేసి చూస్తే ఈ మధ్య కాలంలోనే వాటి విలువ రూ. 6 […]

Advertisement
Update: 2016-02-29 22:27 GMT

వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాను పార్టీ మారాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. సోమవారం జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆదినారాయణరెడ్డి జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ ఆస్తులకు వడ్డీలు కట్టితే ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 6 లక్షల కోట్లని తేల్చారు. అప్పట్లో జగన్‌ సంపాదించింది లక్ష కోట్లు అన్నారని దానికి రూపాయి వడ్డీ వేసి చూస్తే ఈ మధ్య కాలంలోనే వాటి విలువ రూ. 6 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. జగన్‌కు చెక్‌ పెట్టేందుకే తాను టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు. పులివెందుల పూల అంగళ్ల వీధిలోనే జగన్‌ చిట్టా విప్పుతానని శపథం చేశారు. అయితే అందుకోసం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సమావేశం ఏర్పాటు చేయాలని ఆది సూచించారు. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న ఆదినారాయణ రెడ్డి… అయితే తనను ఇబ్బంది పెట్టే వారిని తిరిగి ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడనన్నారు. కడప జిల్లాలో జగన్‌కు చెక్‌ పెట్టేంత శక్తి ఆదినారాయణరెడ్డికి ఉన్నదా అన్నదే ప్రశ్న.

Click on image to read:

 

Advertisement

Similar News