పవన్ ఒక్క పాట ఖరీదు 5 కోట్లు

అవును… పవన్ కల్యాణ్ కేవలం ఒకే ఒక పాట కోసం నిర్మాతతో 5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టించాడు. ఎందుకంటే… అది అంత ప్రతిష్టాత్మకం కాబట్టి. గబ్బర్ సింగ్ సినిమాలో టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. బాబా సెహ్ గల్ పాడిన ఆ పాట ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంది. అలాంటి హిట్ సాంగ్ కు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో మరో పాట కంపోజ్ చేశాడు దేవిశ్రీప్రసాద్. […]

Advertisement
Update: 2016-02-28 20:43 GMT
అవును… పవన్ కల్యాణ్ కేవలం ఒకే ఒక పాట కోసం నిర్మాతతో 5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టించాడు. ఎందుకంటే… అది అంత ప్రతిష్టాత్మకం కాబట్టి. గబ్బర్ సింగ్ సినిమాలో టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. బాబా సెహ్ గల్ పాడిన ఆ పాట ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంది. అలాంటి హిట్ సాంగ్ కు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో మరో పాట కంపోజ్ చేశాడు దేవిశ్రీప్రసాద్. ఈ పాట కూడా పవన్ కు చాలా బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా షూటింగ్ చేశాడట. ఇప్పటికే వంద గుర్రాలు, వంద కార్లు పెట్టి ఇంట్రో సాంగ్ లో కొన్ని సన్నివేశాలు తీసిన పవన్…. తాజాగా మరో వంద మంది చిన్నారులతో కొన్ని స్టెప్పులు వేశాడట. ఈ చిన్నారులంతా గబ్బర్ సింగ్ డ్రెస్సుల్లోనే కనిపిస్తారట.
వీటితోపాటు పాట కోసం రామోజీ ఫిలింసిటీలో కూడా కొన్ని భారీ సన్నివేశాలు తీశారట. ఇలా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా… పవన్ టైటిల్ సాంగ్ ను షూట్ చేశారట. అందుకే ఈ ఒక్క పాటకే 5 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు యూనిట్ చెబుతోంది. నిజానికి విడుదలకు ముందే లాభాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుకు 5 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుపెట్టడం పెద్ద లెక్కే కాదు.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News