కమల్ హాసన్ ఫ్రెండ్ తో నాని సినిమా రీమేక్

కమల్ హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు రమేష్ అరవింద్. ఇతడు గతంలో ఉత్తమ్ విలన్ అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు… మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్టయిన భలే భలే మగాడివోయ్ సినిమాను కన్నడంలో రీమేక్ చేస్తున్నాడు. గణేశ్, శాన్వి హీరోహీరోయన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గండ్రు ఎందరే గండ్రు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు మాతృక కథకు ఏమాత్రం మార్పులు చేయకుండా ఉన్నది […]

Advertisement
Update: 2016-02-27 22:06 GMT
కమల్ హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు రమేష్ అరవింద్. ఇతడు గతంలో ఉత్తమ్ విలన్ అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు… మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్టయిన భలే భలే మగాడివోయ్ సినిమాను కన్నడంలో రీమేక్ చేస్తున్నాడు. గణేశ్, శాన్వి హీరోహీరోయన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గండ్రు ఎందరే గండ్రు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు మాతృక కథకు ఏమాత్రం మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు.
తెలుగులో సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థే కన్నడలో కూడా దీన్ని నిర్మిస్తోంది. రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కు కమల్ హాసన్ ను వాడుకునే ఆలోచనలో ఉన్నాడు రమేష్ అరవింద్. మొత్తానికి నాని సినిమా కమల్ వరకు వెళ్లిందన్నమాట.
Tags:    
Advertisement

Similar News