మెగా కాంపౌండ్ లోకి లావణ్య త్రిపాఠి

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో వరుసగా విజయాలందుకుంది లావణ్య త్రిపాఠి. ఆమెకంటూ తెలుగులో ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఏకంగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇప్పటికే అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న లావణ్య… త్వరలోనే వరుణ్ తేజ సరసన కూడా నటించనుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు వరుణ్ తేజ. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకునే […]

Advertisement
Update: 2016-02-26 21:02 GMT
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో వరుసగా విజయాలందుకుంది లావణ్య త్రిపాఠి. ఆమెకంటూ తెలుగులో ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఏకంగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇప్పటికే అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న లావణ్య… త్వరలోనే వరుణ్ తేజ సరసన కూడా నటించనుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు వరుణ్ తేజ. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలున్నాయి.
నిజానికి శ్రీనువైట్ల-వరుణ్ తేజ సినిమానే ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. క్రిష్ తో అనుకున్న రాయబారి సినిమాను కొన్నాళ్లు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట వరుణ్ తేజ. అదే కనుక జరిగితే శ్రీనువైట్ల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు అందులో లావణ్యనే హీరోయిన్ గా ఉంటుంది. ప్రస్తుతానికి మాటలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు… త్వరలోనే చేతల్లోకి మారుతుందని ఆశిద్దాం.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News