బాబు డాక్టరేట్ కంటే ముందే మునిగేలా ఉంది!

చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన అమెరికా చికాగో స్టేట్ యూనివర్శిటీ ఆ కార్యం కూడా పూర్తి చేసే సూచనలు కనిపించడం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన వర్శిటీ తాజాగా ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించింది.  900 మంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేసింది.  సిబ్బందిని తొలగించేందుకే  ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించింది. కొద్దికాలంగా వర్శిటీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వర్శిటీలో అవకతవకలు జరిగాయంటూ చికాగో స్టేట్ గవర్నమెంట్‌ కూడా నిధులు నిలిపివేసింది. అప్పటి నుంచి వర్శిటీ […]

Advertisement
Update: 2016-02-27 12:21 GMT

చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన అమెరికా చికాగో స్టేట్ యూనివర్శిటీ ఆ కార్యం కూడా పూర్తి చేసే సూచనలు కనిపించడం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన వర్శిటీ తాజాగా ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించింది. 900 మంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేసింది. సిబ్బందిని తొలగించేందుకే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించింది.

కొద్దికాలంగా వర్శిటీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వర్శిటీలో అవకతవకలు జరిగాయంటూ చికాగో స్టేట్ గవర్నమెంట్‌ కూడా నిధులు నిలిపివేసింది. అప్పటి నుంచి వర్శిటీ పరిస్థితి దినదినగండంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారైంది. ఈనేపథ్యంలోనే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి 900 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు నోటీసులు జారీ చేశారు. భవిష్యత్తుపై ఒక అంచనాకు రాలేకపోతున్న యాజమాన్యం సిలబస్ కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. మే 13న సెమిస్టర్ ముగియాల్సి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 28 నాటికి పూర్తి చేసి విద్యార్థులను పంపించాలని నిర్ణయించింది. పరిస్థితిని చూస్తుంటే వర్శిటీ మూతపడినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రస్తుతం యూనివర్శిటీ డాక్టరేట్లను ప్రదానం చేసే స్థితిలో లేదంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డాక్టరేట్ కల కలగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నట్టు వర్శిటీ ప్రకటించడంతో రాష్ట్రంలో దాని పేరు మార్మోగింది. అమెరికాలోనే ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తోందంటూ ప్రచారం జరిగింది. టీడీపీ శ్రేణులు సంబరపడ్డాయి. కానీ ఆ ఆనందం కూడా అప్పట్లో ఒక్కరోజే మిగిలింది. అమెరికాలో చికాగో యూనివర్శిటీ, చికాగో స్టేట్ యూనివర్శిటీ అని రెండు ఉన్నాయి. చికాగో యూనివర్శిటీ అమెరికాలోని వర్శిటీల్లో టాప్ 10లో ఉంటుంది. చికాగో స్టేట్ యూనివర్శిటీ మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేని వర్శిటీ. దాని పేరు కూడా అక్కడ పెద్దగా తెలియదు. అయితే టీడీపీ నేతలు చంద్రబాబుకు చికాగో యూనివర్శిటీ డాక్టరేట్ ఇస్తోందని(లోకేష్ తన ట్విట్టర్‌లోనూ అలాగే రాశారు) ప్రచారం చేశారు. అయితే అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు అసలు విషయం ఏపీలోని మీడియా సంస్థలకు చేరవేశారు. దీంతో చంద్రబాబు డాక్టరేట్ వ్యవహారం నవ్వుల పాలైంది. అయినా అమెరికా యూనివర్శిటీ కదా అని అందరూ గొప్పగానే భావించారు. కానీ ఇప్పుడు వర్శిటీ భవితవ్యంపైనే నీలినీడలు అలముకున్నాయి.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News