అప్పుడు వారు దద్దమ్మలైతే... ఇప్పుడు వీరు?

2004 నుంచి 2014వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మేజారిటీ ఎంపీలు కాంగ్రెస్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించారు. కానీ కేంద్ర రైల్వే బ‌డ్జెట్‌లో ఏపీకి మాత్రం మొండిచెయ్యే దక్కేది. ప్ర‌తి బడ్జెట్‌లో ఒక‌టో రెండో ప్ర‌తిపాద‌న‌లు త‌ప్ప భారీ ప్రాజెక్టులేవీ ఏపీకి రాలేదు. అప్ప‌ట్లో రైల్వే బ‌డ్జెట్ అంటే ఏపీ కాంగ్రెస్ ఎంపీలు వ‌ణికిపోయేవారు. ప్ర‌తి బ‌డ్జెట్‌లోనూ కేంద్రం ఏపీకి పెద్ద‌గా ప్రాజెక్టులు కేటాయించ‌క‌పోవ‌డం… వెంట‌నే టీడీపీతోపాటు ఏపీలో టీవీ చాన‌ళ్లు ఎంపీల‌పై విరుచుకుప‌డేవి. ఒక‌టి రెండు చాన‌ళ్లు ఏకంగా […]

Advertisement
Update: 2016-02-25 03:49 GMT

2004 నుంచి 2014వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మేజారిటీ ఎంపీలు కాంగ్రెస్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించారు. కానీ కేంద్ర రైల్వే బ‌డ్జెట్‌లో ఏపీకి మాత్రం మొండిచెయ్యే దక్కేది. ప్ర‌తి బడ్జెట్‌లో ఒక‌టో రెండో ప్ర‌తిపాద‌న‌లు త‌ప్ప భారీ ప్రాజెక్టులేవీ ఏపీకి రాలేదు. అప్ప‌ట్లో రైల్వే బ‌డ్జెట్ అంటే ఏపీ కాంగ్రెస్ ఎంపీలు వ‌ణికిపోయేవారు. ప్ర‌తి బ‌డ్జెట్‌లోనూ కేంద్రం ఏపీకి పెద్ద‌గా ప్రాజెక్టులు కేటాయించ‌క‌పోవ‌డం… వెంట‌నే టీడీపీతోపాటు ఏపీలో టీవీ చాన‌ళ్లు ఎంపీల‌పై విరుచుకుప‌డేవి. ఒక‌టి రెండు చాన‌ళ్లు ఏకంగా మ‌న ఎంపీలు ద‌ద్ద‌మ్మ‌లు అంటూ ప్రోమోలు వేసేవి. సీన్ అక్క‌డితో క‌ట్ చేస్తే 2014లో తెలంగాణ నుంచి టీఆర్ఎస్, ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు అత్య‌ధికంగా గెలిచారు. ప‌దేళ్ల పాటు తిట్లుతిన్న కాంగ్రెస్ వాళ్లు సోదిలో లేకుండా పోయారు.

టీడీపీ కూడా కేంద్రంలో భాగ‌స్వామి కావ‌డంతో ఇక ప్రాజెక్టులు ప‌రిగెత్తుకుంటూ వ‌స్తాయ‌ని జ‌నం అనుకున్నారు. ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ ప్ర‌త్యేక జోన్ క‌ల సాకారం అవుతుంద‌ని అనుకున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు కూడా నేరుగా కేంద్ర రైల్వే మంత్రిని క‌లిశారు. దీంతో విశాఖ ప్ర‌త్యేక రైల్వే జోన్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ బ‌డ్జెట్ లో ఆ వాస‌నే లేదు. పైగా రైల్వే జోన్ విశాఖ‌కు కాకుండా త‌మ‌ గుంటూరు జిల్లాకు ఇవ్వాల‌ని ఎంపీ రాయ‌పాటి పోటీప‌డ‌డంతో అబ్బో నిజంగానే జోన్ వ‌చ్చేస్తోందేమోనని జ‌నం నోర్లు తెరుచుకుని ఎదురుచూశారు. కానీ నోట్లోకి మ‌ట్టికొట్టి వ‌దిలేశారు. మ‌రో ముఖ్య‌మైన ఆశ కూడా ఫ‌లించ‌లేదు.

ఇటీవ‌ల అమ‌రావ‌తికి రైల్వే యూనివ‌ర్శిటీ వ‌స్తుంద‌ని చంద్ర‌బాబుతోపాటు టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. కానీ ఆ యూనివ‌ర్శిటీ గుజ‌రాత్ వెళ్లిపోయింది. ఇలా పెద్ద‌పెద్ద హామీలే కాదు… చిన్న‌చిన్న కోరిక‌లు కూడా తెలుగు రాష్ట్రాల‌కు తీర‌లేదు. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు మోక్షం లభించలేదు. తెలంగాణ‌కు కూడా గుండు సున్న ఎదురైంది. ఇక్క‌డి ఎంపీలుగానీ, కేంద్ర‌మంత్రి గానీ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మాత్రమే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ ను పొడిగించాలన్న ప్రతిపాదనను కూడా పట్టించుకోలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. గొప్ప‌గా చెప్పుకోద‌గ్గ ఒక్క ప్రాజెక్ట్ కూడా మనకు రాలేదు. ప‌దేళ్లు కాంగ్రెస్ ఎంపీల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టాం… మ‌రీ ఇప్పుడు ఎంపీలు సాధించిందేమిటి. టీఆర్ఎస్ ఎంపీల సంగతి పక్కనపెడితే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏం సాధించిందో చెబితే బాగుంటుంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News